పులివెందులలో మర్డర్ ప్రకంపనలు

Kill Murder People Knife Stabbing Man Stab
Spread the love

ఏపీ ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పేరు ప్రస్తావించగానే చాలామంది ఫ్యాక్షన్ గుర్తుకొస్తుంది. దానికి తగ్గట్టుగానే అనేక హత్యలు అక్కడ జరిగాయి. కానీ ఇప్పుడు తాజాగా అన్నింటికీ భిన్నంగా సినిమా తరహాలో సాగిన హత్యోదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో హైదరాబాద్, విజయవాడలో గ్యాంగ్‌వార్ చూసిన జనాలకు తాజాగా పులివెందల గడ్డ మీద జరిగిన మర్డర్ కలకలం రేపుతోంది. ఓ గ్యాంగ్‌పై మరో గ్యాంగ్ ఆధిపత్యం సాధించడానికి, ప్రాణాలకు తీయడానికి కూడా వెనుకాడవు. సినిమా ప్రభావంతో ఈ సంస్కృతి చిన్నచిన్న పట్టణాలకు సైతం పాకింది.

పులివెందులలో మహమ్మద్‌ రఫీ అనే యువకుడిని చోటు బ్యాచ్‌ దారుణంగా హత్య చేసింది. బైక్‌పై వెళ్తున్న రఫీని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేసింది. ఈ ఘటనలో 8 మంది యువకులు పాల్గొన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికి వరకు కడప జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలను చూసిన జనం.. ఈ తరహా హత్యను చూడడం ఇదే తొలిసారి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఎన్నో ఫ్యాక్షన్ హత్యలను చేధించిన పోలీసులకు ఈ హత్య సవాల్‌గా మారింది. రఫీ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *