Main Menu

కర్నూలు కోసం బాబు కుస్తీ

Spread the love

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా చంద్రబాబు తొలుత తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని ఆదేశించారు. శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరిన సందర్భంగా రాజీనామా చేయడంతో ఆరు నెలలకే ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. దాంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పలువురు ఆశావాహులు క్యూలో ఉన్నారు. వారిలో డిప్యూటీ సీఎం కేఈ సోదరుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. దాంతో కేఈ ప్రభాకర్, శ్రీధర్ రెడ్డిలో ఒకరు ఖాయం అనే వాదన వినిపిస్తోంది. రేపు అభ్యర్థిని ప్రకటిస్తామని టీడీపీ ప్రకటించింది.

ఇక వైసీపీ కూడా ఇద్దరి నేతల పేర్లు పరిశీలిస్తోంది. వారి తాజా మాజీ శిల్పా చక్రపాణిరెడ్డి పేరు ఉంది. కానీ ఆయన మాత్రం తనకు శ్రీశైలం అసెంబ్లీ సీటుని కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉంది. దాంతో మరోసారి గౌరు వెంకటరెడ్డిని రంగంలో దింపడం అనివార్యంగా మారుతుందనే వాదన ఉంది. అయితే గతంలో మాదిరిగా క్యాంపులు వంటి హంగామా లేకుండా సాదాసీదాగా ఎన్నికలు జరగవచ్చనే అంచనాలున్నాయి.






Related News

వైసీపీలో వారికి ఛాన్స్ లేదు..!

Spread the love5Sharesవైసీపీ లో ప్ర‌స్తుతం 44మంది ఎమ్మెల్యేలున్నారు. 67మంది ఎమ్మెల్యేలు గెలిచిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత 23 మంది ఫిరాయించ‌డంతోRead More

చంద్ర‌బాబు రాంరాం అంటున్న సీమ సిట్టింగులు వీరే

Spread the love4Sharesఏపీ అంత‌టా రాజ‌కీయంగా ఒక‌ర‌కంగా ఉంటే రాయ‌ల‌సీమ‌లో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత సంక్లిష్టంగా క‌నిపిస్తోంది. గ‌డిచిన ఎన్నిక‌లRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *