Main Menu

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the love

వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో సాగ‌డంతో చిక్కులు కొనితెచ్చుకున్న‌ట్ట‌య్యింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ టెంపో కొన‌సాగించ‌డానికి త‌గ్గ‌ట్టుగా జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. ప్ర‌త్యేక హోదా త‌న ఎన్నిక‌ల ఎజెండాగా రెండేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించిన జ‌గ‌న్ దానిక‌నుగుణంగా ప‌థ‌క‌ర‌చ‌న చేస్తున్నారు. అదే స‌మ‌యంలో సామాజిక స‌మీక‌ర‌ణాల విష‌యంలో కొంత జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు.

గ‌డిచిన ఎన్నిక‌ల్లో కాపు, మైనార్టీ వ‌ర్గాల‌కు వైసీపీ పెద్ద పీట వేసింది. ముఖ్యంగా కోస్తాలో కాపుల‌కు పెద్ద సంఖ్య‌లో సీట్లు కేటాయించింది. గోదావ‌రి జిల్లాల్లో అయితే 5 ఎంపీ సీట్ల‌కు గాను 3 చోట్ల కాపుల‌కు అవ‌కాశం ఇచ్చింది. అయినా ఆశించిన ఫ‌లితాలు ద‌క్క‌లేదు. అదే స‌మ‌యంలో మైనార్టీల‌కు కూడా ప్రాధాన్య‌త‌నిచ్చారు. టీడీపీ కేవ‌లం ఒకే ఒక్క సీటు అది కూడా పీలేరులో స‌మైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసిన నాటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడి మీద బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిగా మైనార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ వైసీపీ మాత్రం నాలుగు స్థానాల‌ను మైనార్టీల‌కు కేటాయించింది. నాలుగు సీట్లు కూడా గెలుచుకోవ‌డం విశేషం. జ‌లీల్ ఖాన్, ముస్తాఫా, చాంద్ బాషా, అంజాద్ బాషా వైసీపీ తరుపున గెలిచినప్ప‌టికీ క‌దిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, విజ‌య‌వాడ వెస్ట్ నుంచి విజ‌యం సాధించిన జ‌లీల్ ఖాన్ ఆ త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం గుంటూరు,. క‌డ‌ప ఎమ్మెల్యేలు మాత్రం మైనార్టీ నేత‌లుగా వైసీపీలో కొన‌సాగుతున్నారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రికీ అవ‌కాశం ఖాయంగా ఇస్తార‌ని జ‌గ‌న్ స‌న్నిహితుల వాద‌న‌. గుంటూరులో ముస్తాఫాని మార్చాల్సి వ‌స్తే మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌స్తాన్ వలీకి అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. అంతేగాకుండా క‌ర్నూలు సిటీ ఎమ్మెల్యే సీటుకి మైనార్టీనేత‌ను జ‌గ‌న్ ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. అనంత‌పురంలో కూడా మ‌రో మైనార్టీకి కేటాయించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అంతేగాకుండా మైనార్టీ నేత‌కు మ‌రో సీటు కేటాయించ‌డానికి జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్టు ప్రచారం సాగుతోంది. ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 4 స్థానాలు ద‌క్కించుకున్న మైనార్టీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఐదో సీటు గా క‌దిరి కేటాయిస్తారా లేక మ‌రో చోట ద‌క్కుతుందా అన్న చ‌ర్చ ఆ పార్టీలో సాగుతోంది.


Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *