Main Menu

రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు

Adinarayana-Reddy1455803904
Spread the love

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీలో ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. వాస్త‌వానికి జిల్లాలో సీఎం ర‌మేష్ కి హ‌వాకి అడ్డే లేద‌న్న‌ట్టుగా క‌నిపించేది. చివ‌ర‌కు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి స‌హా ప‌లువురు ఫిరాయింపుల‌కు సీఎం రమేష్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఏకంగా జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి అనుచ‌రులు ఆయ‌న మీద దాడికి దిగేటంత‌వ‌ర‌కూ ప‌రిణామాలు వెళ్లాయి. అయినా సీఎం ర‌మేష్ మాత్రం అటు క‌డ‌ప‌, ఇటు క‌ర్నూలు జిల్లాలో ప‌లువురుని పార్టీలోకి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

అయితే ఇప్పుడు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో సీఎం ర‌మేష్ కి అదే ఆటంకంగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.. ఆయ‌న్ని చిక్కుల్లో నెడుతోంది. సీఎం ర‌మేష్ కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. ఏరికోరి సైకిల్ ఎక్కించుకున్న మంత్ర ఆదినారాయ‌ణ రెడ్డి సీఎం ర‌మేష్ కి చెక్ పెట్టే యోచ‌న‌లో క‌నిపిస్తోంది. క‌డ‌ప జిల్లా తెలుగుదేశంలో సంపూర్ణ ఆధిప‌త్యం కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు సీఎం ర‌మేష్ అడ్డంకిగా మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నారు. ఇప్ప‌టికే మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ గా ప‌నిచేసిన సతీష్ రెడ్డిని ప‌రిమితం చేశారు. ఏకంగా సీఎం ర‌మేష్ కి రాజ్య‌స‌భ సీటు లేకుండా చేస్తే చాలనే యోచ‌న‌లో మంత్రి ఆది ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అందుకు త‌గ్గ‌ట్టుగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో సీఎం ర‌మేష్ కి అవ‌కాశం రాకుండా ఆది విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాయ‌ల‌సీమ రెడ్డి నినాదం తెర‌మీద‌కు తెచ్చారు. అందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు శ్రీనివాస‌రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మేడా రవీంద్ర‌నాథ్ రెడ్డి, పుత్తా ల‌లో ఒక‌రి పేరును ప‌రిశీలించాల‌ని కోరుతున్నారు. ప‌దేళ్లుగా టీడీపీ నుంచి ఒక్క రెడ్డికి కూడా ఎంపీ టికెట్ ఇవ్వ‌లేదని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం ద్వారానే జ‌గ‌న్ కి చెక్ పెట్ట‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు. తద్వారా ఒక‌టి త‌న హ‌వా పెంచుకోవ‌డంతో పాటు, సీఎం ర‌మేష్ కి చెక్ పెట్టేయ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న చేస్తున్నారు. అయినా చంద్ర‌బాబు మాత్రం సీఎం ర‌మేష్ ని అంత త్వ‌ర‌గా వ‌దులుకునే అవ‌కాశం లేద‌నే స‌మాచారం అందుతోంది కంభంపాటి, సుజనా కూడా సీఎం ర‌మేష్ కి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న‌ప్ప‌టికీ ఆఖ‌రికి ఆయ‌న‌కే అవ‌కాశం ఉంటుంద‌ని స‌మ‌చారం. అయితే సీఎం ర‌మేష్ కి టికెట్ ద‌క్కినా లేకున్నా క‌డ‌ప జిల్లాలో ఆధిప‌త్యం కోసం త‌న‌కుర్చీకే ఎస‌రు పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆదినారాయ‌ణ రెడ్డి ప‌ట్ల ర‌మేష్ తీరు ఎలా ఉంటుంద‌న్న‌దే ఆస‌క్తిగా మారుతోంది. టీడీపీ క‌డ‌ప జిల్లా ప‌రిణామాలు కొత్త మ‌లుపు తిర‌గ‌డం ఖాయంగా ఉంది.






Related News

jc diwakar reddy

చంద్ర‌బాబు ప‌రువుతీసేసిన టీడీపీ ఎంపీ

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై అధికార పార్టీ ఎంపీ చెల‌రేగిపోయారు. చంద్ర‌బాబు ధోర‌ణి వ‌ల్లే ఏపీకి అన్యాయంRead More

buggana

స్పీక‌ర్ కి నోటీసులు పంపించిన బుగ్గ‌న

Spread the loveత‌న‌కు వ్య‌తిరేకంగా సాగిన ప్ర‌చారంపై పీఏసీ చైర్మ‌న్ ఫైర‌య్యారు. ఏకంగా ప్రివిలైజ్ నోటీసులు పంపించారు.ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *