Main Menu

వైసీపీ బాట‌లోనే టీడీపీ

Spread the love

విప‌క్షం బాట‌లోనే అధికార టీడీపీ కూడా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. ప‌లువురు నేత‌ల‌కు కండువాలు క‌ప్పే కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుడుతున్నారు. వ‌రుస‌గా ఒక్కో రోజు ఒక్కో నేత‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేశారు. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్లును స‌న్న‌ద్ధం చేశారు.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా కావ‌లికి చెందిన మాజీ ఎమ్మెల్యేలిద్ద‌రూ వైసీపీని వీడిన నేప‌థ్యంలో వారికి పార్టీ కండువా క‌ప్పే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. అంతేగాకుండా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నేత‌లు కొణతాల రామ‌కృష్ణ‌, స‌బ్బం హ‌రి, దాడి వీర‌భ‌ద్ర‌రావు కూడా టీడీపీలో చేరిక‌కు ఉత్సుక‌త చూపుతున్నారు. వారితో పాటుగా వైరిచ‌ర్ల కిషోర్ చంద్ర‌దేవ్ కూడా క్యూలో ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా కూడా అదే వ‌రుస‌లో ఉన్నారు.

ఇంకా మ‌రికొంద‌రు నేత‌లు కూడా టీడీపీలో చేరేందుకు స‌ముఖుంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మాజీ వైసీపీ నేత చెల‌మ‌ల‌శెట్టి సునీల్ కూడా సైకిలెక్కే య‌త్నంలో ఉన్నారు. మాజీ స్పీక‌ర్ బాల‌యోగి త‌న‌యుడు హ‌రీష్ మాధూర్ కూడా రాజ‌కీయ ఆరంగేట్రం చేయ‌బోతున్నారు. ఇలాంటి నేత‌లంద‌రికీ వ‌రుస‌గా పార్టీలో చేరిక కార్య‌క్ర‌మాలు సాగించ‌డం ద్వారా అంద‌రి చూపు విప‌క్షం వైపు ఉంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డ‌కుండా చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

త‌మ పార్టీ నుంచి వైసీపీలో చేరుతున్న‌ట్టుగానే అటు నుంచి కూడా త‌మ వైపు వ‌స్తున్నార‌నే సంకేతాలిచ్చేందుకు, ఒత్తిడిలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో మ‌నోధైర్యం నింపేందుకు టీడీపీ ఎత్తులు వేస్తోంది. ఈ వ్య‌వ‌హారాల‌కు ఒక‌టి రెండు రోజుల్లో శ్రీకారం చుట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్రతీ రోజూ టీడీపీ లో నేత‌లు చేరుతున్నార‌నే అభిప్రాయం క‌ల్పించేయ‌త్నంలో ఉన్నారు.






Related News

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the loveవైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతోRead More

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *