Main Menu

Latest Survey: చిత్తూరులో ఎవ‌రి సీన్ ఎలా ఉంది?

Spread the love

అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ఏపీ రాజకీయాల్లో హీటు రాజుకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌న్న దానిపై ఆస‌క్తి క‌నిపిస్తోంది. దాంతో అన్ని పార్టీలు ప్ర‌చార ప‌ర్వంలో జోరుగా సాగుతున్నాయి. అధికారం ఆశ‌ల్లో క‌నిపిస్తున్నాయి.

మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోవాల‌ని టీడీపీ ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే గ‌డిచిన ఎన్నిక‌ల్లో దెబ్బ‌తిన్న సీఎం సొంత జిల్లాలో ఇప్పుడు చావోరేవో అన్న‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ టీడీపీ య‌త్నాలు ఫ‌లిస్తాయా లేదా అన్న‌ది ఇప్పుడు సందేహంగా క‌నిపిస్తోంది.

ఇక గ‌డిచిన ఎన్నిక‌ల్లో చిత్తూరులోని 14 సీట్ల‌కు గానూ మెజార్టీ వైసీపీ కైవ‌సం చేసుకుంది. 8 చోట్ల వైసీపీ విజ‌యం సాధించింది. 6 సీట్ల‌తో టీడీపీ స‌రిపెట్టుకుంది. ఇక రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తాజా స‌ర్వే ప్ర‌కారం వైసీపీ త‌న ఆధిప‌త్యాన్ని నిల‌బెట్టుకునే దిశ‌లో సాగుతోంది. పైగా గ‌తం క‌న్నా ఎక్కువ స్థానాల‌ను ద‌క్కించుకోబోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి టీడీపీ కేవ‌లం కుప్పం, ప‌ల‌మ‌నేరు స్థానాల్లో మాత్ర‌మే గ్యారంటీగా క‌నిపిస్తోంది. మ‌రో నాలుగు స్థానాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. అందులో శ్రీకాళ‌హ‌స్తి, మ‌ద‌న‌ప‌ల్లి, పీలేరు , పూత‌ల‌ప‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఇక మిగిలిన స్థానాల‌లో వైసీపీకి సానుకూల‌త క‌నిపిస్తోంది. త‌ద్వారా 8 స్థానాల‌ను గ్యారంటీకి ద‌క్కించుకునే అవ‌కాశం విప‌క్ష పార్టీకి క‌నిపిస్తోంది. అందులో టీడీపీ సిట్టింగ్ సీట్లు చిత్తూరు, తిరుప‌తి, స‌త్య‌వేడు వంటి స్థానాల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌లో ఉంది. అదే స‌మ‌యంలో త‌మ సిట్టింగ్ స్థానం ప‌ల‌మ‌నేరు కోల్పోయే ప‌రిస్థితుల్లో ఉండ‌గా, మ‌ద‌న‌ప‌ల్లి, పీలేరు, పూత‌ల‌ప‌ట్టు వంటి చోట్ల ఎదురీదుతోంది.

ఓవ‌రాల్ గా

వైసీపీ – 8
టీడీపీ -2
గ‌ట్టి పోటీ -4






Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *