కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

ysjagan-padayatra
Spread the love

కర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదే పరంపరలో వైసీపీ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది ముఖ్యంగా వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ముందుగా అభ్యర్థిని ప్రకటించడం ద్వారా వైెఎస్ జగన్ కొత్త వ్యూహాలను రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కొన్ని నియోజకర్గాల్లో స్పష్టతనివ్వడం ద్వారా పార్టీ పనికి ఆటంకాలు లేకుండా చేసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

వైసీపీకి సహజంగానే బలమైన నియోజకవర్గాల్లో కర్నూలు ఒకటి. గడిచిన ఎన్నికల్లో కూడా ఆపార్టీ గెలిచింది. కానీ ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించడంతో వైసీపీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం ఏర్పడింది. ఈనేపథ్యంలో జగన్ పాదయాత్ర సందర్బంగా విశేష స్పందన రావడంతో వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో పలు చోట్ల అభ్యర్థులను ఖాయం చేసే పనిలో ఉన్న అధినేత నిర్ణయం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లా గురజాల స్థానం నుంచి కాసు మహేష్ రెడ్డిని గతంలోనే అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా పెనుగొండ సీటుని శ్రీదేవి రెడ్డికి ఖాయం చేశారు. గత వారంలోనే కుప్పం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని రంగంలో దింపుతున్నట్టు ప్రకటించారు.

తాజాగా కర్నూలు సీటుని మైనార్టీలకు కేటాయించి చంద్రబాబు కి షాకిచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబు కేవలం ఒకే ఒక్క సీటు, అది కూడా పరాజయం ఖాయంగా భావించిన పీలేరు స్థానాన్ని మైనార్టీలకు ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ లో గెలిచిన ఇద్దరు మైనార్టీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్(విజయవాడ వెస్ట్), చాంద్ బాషా( కదిరి)ని టీడీపీలో చేర్చుకున్నా మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. దాంతో టీడీపీ పట్ల మైనార్టీలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన కర్నూలుని కూడా మైనార్టీలకు కేటాయించడం ద్వారా జగన్ అనూహ్యమైన ఎత్తు వేశారు. కర్నూలు అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ ని వైసీపీ ప్రకటించి విస్మయం కలిగించింది. కానీ పార్టీకి మాత్రం ప్రయోజనం కలిగించే నిర్ణయంగా అంతా భావిస్తున్నారు. ఏడాది సమయం ఉంది కాబట్టి, పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి హఫీజ్ కి సానుకూలత ఏర్పడుతుందని అంతా భావిస్తున్నారు.


Related News

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the loveకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

tdp dharna

రోడ్డెక్కిన అనంత టీడీపీ

Spread the loveతెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ అందించిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆపార్టీకి బలమైన జిల్లాగా భావిస్తున్న చోటRead More

 • చంద్రబాబు సభలో రౌడీషీటర్
 • అఖిలప్రియ ఏం మంత్రి?
 • టీడీపీకి కొత్త కష్టాలు
 • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
 • కర్నూలు కోసం బాబు కుస్తీ
 • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
 • కర్నూలు అభ్యర్థులెవరు?
 • జగన్ నోట చంద్రబాబు మాట
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *