Main Menu

టీడీపీకి కొత్త కష్టాలు

mahanadu tdp
Spread the love

తెలుగుదేశం పార్టీ కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న సమస్యలకు అదనపు భారం నెత్తిన పెట్టుకుంటోంది. అందుకు కర్నూలు రాజకీయాలను ఉదాహరణగా చెప్పవచ్చు. కొత్తగా నియోజకవర్గాల పెంపుదల పూర్తిగా అటకెక్కిన విషయం తెలిసిన తర్వాత కూడా ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు చివరకు తలనొప్పులు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే నంద్యాలలో భూమా రాకతో బలమైన శిల్పా ఫ్యామిలీ హ్యాండిచ్చింది. ఉప ఎన్నికల పలితాలు ఎలా ఉన్నా సాధారణ ఎన్నికల నాటికి గట్టి దెబ్బ కొట్టడం ఖాయమనే వాదన ఉంది.

ఇక ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సైకిల్ ఎక్కించుకోవడం ఖాయం అయ్యింది. దాని ఫలితంగా పాణ్యం. నందికొట్కూరు నియోజకవర్గాల్లో పరిణామాలు మారిపోవడం ఖాయంగా చెప్పవచ్చు. ఆయా నియోజకవర్గాలలోని ఇద్దరు కీలక నాయకులు వైసీపీ వైపు దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం ప్రారంభమైంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నూతన సంవత్సర విందుతో టీడీపీలో పొరపొచ్చాలు స్పష్టంగా బహిరంగమయ్యాయి. అక్కడ పర్యాటక మంత్రికి కొత్త కష్టాలు ఖాయమనే చెబుతున్నారు.

ఇక నంద్యాల స్థానం విషయంలో కూడా ఎస్పీవై రెడ్డి, భూమా, ఫరూక్ వర్గీయులు ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఉపఎన్నికల్లో కొంత ఊక్యత ప్రదర్శించినా ఇప్పుడు పూర్తిగా వేరు కుంపట్లు రాజేస్తున్నారు. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని భావిస్తున్నారు. కర్నూలులో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇక కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి భవిష్యత్తులో టీడీపీకి తోడుగా ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మిగనూరు శాసనసభా స్థానం నుంచి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక వర్గాల మధ్య టికెట్ కోసం ఒత్తిడి నెలకొని ఉంటుందని టీడీపీలో చర్చ సాగుతుండగా ఇటీవలే జయనాగేశ్వరరెడ్డి తనకే టికెట్ ఖాయమంటూ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో ఇదే పరిస్థితి దాపురించింది. నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ పుట్టి ముంచే దశకు చేరుకుంటోంది. దాంతో ఎవరిని ఎలా సర్థుబాటు చేయాలో తెలియని సందిగ్ధం ఏర్పడింది. అందులోనూ జిల్లాలో పార్టీ నాయకత్వాన్ని ఏకతాటిపై నడపగల నాయకుడు లేకపోవడం పెద్ద సమస్యగా తయారవుతోంది. డిప్యూటీ సీఎం కేఈని మరో మంత్రి అఖిలప్రియ అసలు ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వంలో కూడా పట్టులేదని తేలడంతో చాలామంది నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో కర్నూలు టీడీపీ వ్యవహారం ఎటు మళ్లుతుందోననే చర్చ సాగుతోంది.


Related News

A palm

మాజీ ఎమ్మెల్యే త‌న‌యుడు ఆత్మ‌హ‌త్య‌

Spread the loveమాజీ ఎమ్మెల్యే త‌న‌యుడొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం అల‌ముకుంది.Read More

supreme

సుప్రీంకోర్ట్ కి చేరిన టీటీడీ తగాదా

Spread the loveతిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం సుప్రీంకోర్ట్ కి చేరింది. అత్యున్నతన్యాయస్థానంలో పిటీషన్ వేయాలని ఇప్పటికే బీజేపీ నేతRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *