కర్నూలు అభ్యర్థులెవరు?

kurnool
Spread the love

మరోసారి అందరి ద్రుష్టి కర్నూలు వైపు మళ్లబోతోంది. ఉప ఎన్నికలు అనివార్యంగా ముంచుకురావడంతో కర్నూలు కేంద్రం రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. ఏప్రిల్ లో శాసనమండలి ఎన్నికల్లో గెలిచి ఆగష్ట్ లో రాజీనామా సమర్పించిన శిల్పా చక్రపాణి రెడ్డి కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానినిక జరగబోతున్న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు హీటు రాజుకుంది. వచ్చే నెల 12న పోలింగ్, 16 ఫలితాలు వెలువడవబోతున్నాయి.

ఇక ఈ ఆసక్తకర పోటీలో ఎవరు నిలుస్తారోనన్న చర్చ మొదలయ్యింది. వైసీపీలో కొంత క్లారిటీ కనిపిస్తోంది. శిల్పా చక్రపాణి రెడ్డి మరోసారి రంగంలో దిగవచ్చని భావిస్తున్నారు. ఆయన కాకుంటే గౌరు వెంకటరెడ్డి ఖాయం. గడిచిన ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఇక టీడీపీ తరుపున పోటీ చేయాలనే వారి సంఖ్య పెద్దగానే కనిపిస్తోంది. పలువురు నేతలు క్యూ కడుతున్నారు. వారిలో నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి అల్లుడు, డిప్యూటీ సీఎం కేఈ సోదరుడి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రెడ్డి సామాజికవర్గం అయితే ఎస్పీవై అల్లుడు శ్రీధర్ రెడ్డికి చాన్స్ ఉంటుందని, ప్రత్యామ్నాయం చూడాలనుకుంటే ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా ఆశాభావంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

ఇక బీసీ కోటాలో అయితే మాత్రం కేఈ ప్రభాకర్ కి ఖాయంగా చెప్పవచ్చు. ఆయన కూడా బలంగా ప్రయత్నిస్తున్నారు. దాంతో ఇది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. మరోసారి ఎమ్మెల్సీ సీటు రెడ్లకే కేటాయిస్తారా లేదా అన్నది చూడాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ టికెట్ ఆశావాహుల జాబితాలోకి రాకుండా ఈసారి మండలికి పంపించడానికే చంద్రబాబు మొగ్గు చూపుతారని ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికల సమయంలో ఎస్పీవై రెడ్డికిచ్చిన మాట ప్రకారం శ్రీధర్ రెడ్డికే దక్కవచ్చని కూడా భావిస్తున్నారు. దాంతో ఇది చర్చనీయాంశంగా మారుతోంది.


Related News

cbn-attar-chand-basha-666-11-1468234534

టీడీపీకి ముదిరిన క‌దిరి..!

Spread the loveటీడీపీలో వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు చోట్ల క‌ల‌హాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కొన్నాళ్ల క్రితంRead More

bjp

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే డిఫెన్స్ లో ఉన్న నేప‌థ్యంలో చిన్న చిన్న అవ‌కాశాల‌ను కూడాRead More

 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *