నేను పోటీ చేస్తున్నా…

kotla hari chakrapani
Spread the love

అందరి ఆశీర్వాదంతోనే ఆలూరు నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఎన్నికల్లో గెలిపిస్తే నిజాయితీ పాలన అందిస్తానని కోట్ల హరిచక్రపాణిరెడ్డి తెలిపారు. దేవనకొండలో ఆత్మీయ సభను నిర్వహించారు. ఆత్మీయ సభకు వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు తరలి వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్నిగ్రామాల ప్రజల అభిమానులు సంపాదించుకోవడమే మండల ప్రజలకు కొంత కాలంగా దూరంగా ఉన్నప్పటికి భారీ సంఖ్యలో తరలి రావడం సంతోషకరమన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తమ కార్యకర్తలకు తాను ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకోవడం జరిగిందన్నారు. గతంలో ఈ మండలంలో ఆరచకాలు ఎక్కువగా ఉండేవని, వాటిని అధికమించి ఆత్మీయతను పెంచుకున్నారన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డోన్ నుండి పోటీ చేసేందుకు అంగీకారం తెలిసినప్పటికి తల్లిలాంటి తన వదిన కోట్ల సూజతమ్మ పోటీ చేస్తానని అడగటం వల్ల సీటును త్యాగం చేశామన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత నా రాజకీయ ఎదుగుదలకు తమ వారే అడ్డుపడడం జరిగిందన్నారు. త్యాగం చేయాలంటే దేనినైన త్యాగం చేయవచ్చుగాని ప్రాణాన్నిగాని, రాజకీయ పదవిని కాని త్యాగం చేయకూడదని ఆయన పేర్కొన్నారు. తన భవిష్యత్తును తన ఆత్మీయులపైన కార్యకర్తలే నిర్ణయించాల్సి ఉందన్నారు. వచ్చే నెలలో నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో కార్యకర్తలు ఏ పార్టీలో చేరమని చెబితే ఆ పార్టీలోనే చేరుతానని స్పష్టం చేశారు. గతంలో జడ్పీటీసీగా గెలుపొంది మండల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు.


Related News

chandrabau kurnool

కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో టిక్కెట్ల తగాదా అప్పుడే మొదలయ్యింది.Read More

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the loveకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

 • రోడ్డెక్కిన అనంత టీడీపీ
 • చంద్రబాబు సభలో రౌడీషీటర్
 • అఖిలప్రియ ఏం మంత్రి?
 • టీడీపీకి కొత్త కష్టాలు
 • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
 • కర్నూలు కోసం బాబు కుస్తీ
 • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
 • కర్నూలు అభ్యర్థులెవరు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *