అమ్ముడుపోయిన ఎమ్మెల్యేని…

kodumuru manigandhi
Spread the love

క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనంటూ వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు. చంద్ర‌బాబుని న‌మ్మి రాజ‌కీయ భవిష్య‌త్తు నాశ‌నం చేసుకున్నాన‌ని వాపోయారు. వైసీపీ నుంచి భారీ మెజార్టీ తో గెలిచి టీడీపీలో చేరిన మ‌ణిగాంధీ వ్యాఖ్య‌లు తాజాగా క‌ల‌క‌లం రేపుతోంది. రాజ‌కీయ చ‌ర్చ‌కు తెరలేపింది.

మ‌ణిగాంధీ మాట‌ల ప్ర‌కారం.. చంద్ర‌బాబు అభివృద్ధి చూసి పార్టీ మారిన‌ట్టు చెబుతున్న మాట‌లు అబ‌ద్ధం. చంద్ర‌బాబుకి అమ్ముడుపోయాను. నేనే కాదు మ‌రికొంద‌రు కూడా ఇదే రీతిలో చేరిపోయారు. కానీ చంద్ర‌బాబు క‌న్నా ఎక్కువ మెజార్టీ సాధించిన నేను ఆశ‌ప‌డి పార్టీ మారి అన‌వ‌స‌రంగా రాజ‌కీయ భ‌విష్య‌త్తు నాశ‌నం చేసుకున్నాను. వ‌చ్చే ఆరు నెల‌ల్లో చాలా మార్పులు జ‌రుగుతాయి. ఎమ్మెల్యే జ‌య‌రాములు కూడా పార్టీ మారిపోతారు. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల‌తో ప‌డ‌లేక‌పోతున్నాను. చివ‌ర‌కు స‌భ్య‌త్వం కోసం ఇచ్చిన డ‌బ్బులు కూడా వాడేసుకున్నారు. రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతాగానీ కోడుమూరు టీడీపీ నేత‌ల‌తో క‌లిసి సాగ‌లేను…అంటూ చెప్పుకొచ్చారు.

దాంతో మ‌ణిగాంధీ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రికొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేల కోసం చంద్ర‌బాబు గాలం వేస్తుంటే ఇప్పుడు గూట్లో చేరిన వారే ప‌క్క చూపులు చూస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిగా మారింది. మ‌ణిగాంధీతో పాటు మ‌రికొంద‌రు కూడా వైసీపీ నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. జ‌గ‌న్ సిగ్న‌ల్ ఇస్తే మ‌రోసారి వైసీపీకి జై కొట్టినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. కానీ అదంత సులువు కాద‌న్న‌ది వాస్త‌వం. ఇప్ప‌టికే మ‌ణిగాంధీ స్థానంలో మాజీ కాంగ్రెస్ నేత‌కు కోడుమూరు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ పెద్ద‌గా ప్రాధాన్య‌త‌నిచ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the love6Sharesబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the love17Sharesవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *