కారెం శివాజీకి షాక్

Will Fight For AP Special Status  Karem Sivaji
Spread the love

ఎస్‌సి, ఎస్‌టి కమిటీ ఛైర్మన్‌ కారెం శివాజీకి నిరసన సెగ తగిలింది. వాల్మీకుల జీవన ప్రమాణస్థాయిలను అధ్యయనం చేసేందుకు ఎస్‌సి, ఎస్‌టి కమిటీ మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతరం కలెక్టర్‌ వీరపాండియన్‌తో కలిసి జడ్‌పి సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభం కాగానే దళితులు, గిరిజనులు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కారెం శివాజీ గో బ్యాక్‌’ అంటూ పెద్దఎత్తున నినదించారు. ఇతరులను ఎస్‌టిల్లో చేర్చడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దళిత, గిరిజనులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వారిని అభివృద్ధి చేయకపోగా ఇతర కులాలను చేర్చడం సరికాదన్నారు.

ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నినాదాలు చేస్తున్న వారిని సమావేశ మందరం నుంచి బయటకు పంపారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకులను ఎస్‌టిల్లో చేర్చేందుకు తగిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోందన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నివర్గాల వారితోనూ మాట్లాడుతోందని చెప్పారు. మొత్తంగా కారెం శివాజీ కి తగిలిన సెగ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *