Main Menu

త‌ప్పు మాది కాదు, చంద్ర‌బాబుదే!

Spread the love

క‌డ‌ప స్టీల్ ప్లాంట్ వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్ర‌ప్ర‌భుత్వం సొంతంగా స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు ముందుకు రావ‌డం ఏపీలోనే తొలిసారి. అయితే విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ విష‌యంలో కేంద్రం జాప్యం చేయ‌డంతో తామే ముందుకు వ‌చ్చామ‌ని ఏపీ సీఎం చెబుతుండ‌గా, త‌ప్పంతా చంద్ర‌బాబు స‌ర్కారుదేన‌ని కేంద్రం ఎదురుదాడి చేస్తోంది. దాంతో స్టీల్ ప్లాంట్ సాక్షిగా రాజ‌కీయ వేడి రాజుకుంటోంది.

కడప స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ తెలిపింది. ముఖ్యమంత్ర చంద్రబాబునాయుడు ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేపధ్యంలో ఉక్కు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను పేర్కొంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక ఇచ్చిందని, అదే సమయంలో ప్లాంటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము సరఫరా వంటి కీలక అంశాలకు సంబంధించిన వివరాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని ఈ ప్రకటనలో తెలిపింది. అటవీ, పర్యావరణ అనుమతుల నివేదికలను కూడా పంపలేదని పేర్కొంది. ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలు తీసుకుంటోందని పేర్కొంది.

కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ నెల 17న టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగిందని, టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ కారణంగానే మెకాన్‌ సంస్థ తుది నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారం అందితే పెట్టుబడులకు ఉన్న మార్గాలను కూడా మెకాన్‌ సంస్థే సూచిస్తుందని ఉక్కు మంత్రిత్వశాఖ తెలిపింది. సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నిర్దేశిస్తుందని పేర్కొంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ ఏపి ప్రజా ప్రతినిధులతో నూ, భాగస్వాములతోనూ చర్చలు కొనసాగిస్తున్నారనివివరించింది. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపింది. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే మెకాన్‌ నివేదికను సిద్ధం చేస్తోందని కేంద్రం వెల్లడించింది.






Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *