జ‌న‌సేన‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

pawan-jc
Spread the love

ఏపీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే హ‌స్తిన నుంచి ఆంధ్రాకు మారిపోయాయి. టీడీపీ ఎంపీలు కూడా ఏపీలో బ‌స్సు యాత్ర‌కు బ‌య‌లుదేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వంలోని జ‌న‌సేన పార్టీ మీద జేసీ కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన జేసీ త‌నకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ప్ర‌క‌టించారు. పార్టీలోకి రావాలంటూ ప‌వ‌న్ స‌న్నిహితులు త‌న‌ను కోరార‌ని వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ తాను నిరాక‌రించార‌ని తెలిపారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మునిగిపోతుందంటూ వ్యాఖ్యానించ‌డం విశేషం. అయితే జేసీ వ్యాఖ్య‌లు మాత్రం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. జ‌న‌సేన కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కి రంగం సిద్ధంచేసింద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అందులోనూ టీడీపీ నేత‌ల‌కు వ‌ల వేస్తుంద‌నే వాద‌న వస్తోంది. ప‌లువురు ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌ని గ‌తంలోనే ప‌వ‌న్ కామెంట్ చేశారు. దానికి త‌గ్గ‌ట్టుగానే జేసీ వంటి సీనియ‌ర్ నేత‌ల‌కు కూడా జ‌నసేన నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిందంటే జ‌న‌సేన ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయిన‌ట్టుగానే టీడీపీ భావిస్తోంది. ఈనెల 15,16 తేదీల‌లో జేసీ దివాక‌ర్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అనంత‌పురంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

అయితే మిగిలిన పార్టీల‌కు భిన్నంగా కొత్త త‌రాన్ని రాజ‌కీయాల్లో ప్రోత్స‌హించ‌డం కోసం జ‌న‌సేన ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆశిస్తే, దానికి భిన్నంగా ఇత‌ర పార్టీల నేత‌ల‌కు కండువాలు క‌ప్పే ప‌నిలో ప‌వ‌న్ కూడా ప‌డిపోతున్నారా అన్న అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఏమ‌యినా జ‌న‌సేన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌భావం, దానికి త‌గ్గ‌ట్టుగానే జేసీ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి.


Related News

av-akhila-priya-666-1522333027

టీడీపీ నేత సుబ్బారెడ్డిపై మంత్రి అనుచ‌రుల దాడి

Spread the loveటీడీపీ వ్య‌వ‌హారాలు వీధికెక్కుతున్నాయి. వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నాయి. ఏకంగా దాడులు చేసుకునే వ‌ర‌కూ వ‌చ్చేశాయి.Read More

badvel jayaramuluy

రాజీనామాకి సిద్ధ‌మ‌వుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ఓవైపు బీజేపీ. మ‌రోవైపు వైసీపీ, అన్నింటికీ మించి ప‌వ‌న్ పార్టీ నుంచి వ‌స్తున్న ఎదురుదాడితోRead More

 • కాటసానికి లైన్ క్లియ‌ర్ చేసిన వైసీపీ
 • టీడీపీలో మ‌రో త‌గాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?
 • వైసీపీలోకి మ‌రో వార‌సుడు
 • వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే
 • జ‌న‌సేన‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
 • చంద్ర‌బాబుపై తిర‌గ‌బ‌డండి..
 • టీడీపీకి ముదిరిన క‌దిరి..!
 • ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *