మ‌రో వివాదంలో జేసీ బ్ర‌ద‌ర్స్..!

07-1452146317-jc-diwakar-reddy-678-09-1457519530
Spread the love

ఏపీలో వివాదాల‌కు కేరాఫ్ గా ఉండే నాయ‌కుల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ ముందుంటారు. నిత్యం కాంట్ర‌వ‌ర్సీల‌తోనే కాలం గ‌డుపుతూ ఉంటారు. సెన్సేష‌న‌ల్ స్టేట్ మెంట్స్ తో జ‌నం నోళ్ల‌లో నానుతూ ఉంటారు. అలాంటి నేత‌లు ఇప్ప‌డు మ‌రో వివాదంలో క‌నిపిస్తున్నారు. అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మూలంగా త‌మ ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేద‌ని చెప్పిన వాళ్లు ఇప్ప‌టికే చాలామంది ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో ఓ జిల్లాస్థాయి అధికారి చేరారు. ఉన్న‌తాధికారుల‌కు మొర‌పెట్టుకున్నారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుకున్నారు . జేసీ అనుచ‌రులు త‌న‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. దాంతో ఈ వ్య‌వహారం పెను దుమారంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏపీలో అక్ర‌మమైనింగ్ పై చంద్ర‌బాబు నిత్యం క‌న్నెర్ర చేస్తున్నారు. స‌హించేది లేద‌ని చెబుతున్నారు. కానీ త‌మ్ముళ్ల తీరు దానికి భిన్నంగా ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. దానికి కొన‌సాగింపుగానే గుత్తి స‌మీపంలో మైనింగ్ దందా వ్య‌వ‌హారం సాగుతోంది. దాని మీద మైనింగ్ ఏడీగా ఉన్న ప్ర‌తాప్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. అక్ర‌మాల‌ను గుర్తించారు. భారీగా జ‌రిమానాలు విధించారు. ప‌లు చోట్ల నిబంధ‌న‌లు ఉల్లంఘించి సాగుతున్న త‌వ్వ‌కాలు అడ్డుకున్నారు. ఇది కంట‌గింపుగా మారిన జేసీ అండ్ కో స‌ద‌రు అధికారిని బ‌దిలీ చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు స‌మాచారం. కానీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో అధికారిని అడ్డు తొల‌గించుకోవ‌డానికి బెదిరింపుల‌కు దిగిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

తాజాగా ప్ర‌తాప్ రెడ్డి త‌న ఉన్న‌తాధికారుల‌కు ఓ లేఖ రాశారు. త‌న‌ను చంపుతామ‌ని జేసీ అనుచ‌రులు బెదిరిస్తున్నారంటూ మొర‌పెట్టుకున్నారు. అక్ర‌మాలు అడ్డుకున్నందుకు అడ్డంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వాపోయారు. జేసీ ప్ర‌ధాన అనుచ‌రుల పేర్ల‌తో రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓవైపు సీఎం అక్ర‌మాలు అడ్డుకుంటామంటుంటే, అది జ‌రిగితే ప్రాణాలు తీస్తామ‌ని అధికారుల మీద‌కు కొంద‌రు టీడీపీ నేత‌లు బెదిరింపుల‌కు దిగ‌డం గ‌మ‌నిస్తే మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత‌న లేని విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది.


Related News

cbn-attar-chand-basha-666-11-1468234534

టీడీపీకి ముదిరిన క‌దిరి..!

Spread the loveటీడీపీలో వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు చోట్ల క‌ల‌హాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కొన్నాళ్ల క్రితంRead More

bjp

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే డిఫెన్స్ లో ఉన్న నేప‌థ్యంలో చిన్న చిన్న అవ‌కాశాల‌ను కూడాRead More

 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *