Main Menu

జ‌న‌సేనాని ప‌ర్య‌ట‌నలో విషాదం

Spread the love

ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న త‌ర్వాత రాయ‌ల‌సీమ‌లో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌లో తొలిరోజే విషాదం అల‌ముకుంది. అంద‌రినీ విషాదంలో ముంచింది. జ‌న‌సేన అదినేత క‌వాతు అనంతపురంలో జ‌రిగింది. అనంత‌రం స‌భ కూడా నిర్వ‌హించారు. ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. సభ ముగిసిన అనంతరం జనసేన కార్యకర్తలు ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కర్నూలు జిల్లా డోన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును, ఓ ప్రైవేటు బస్సును ఢీకొనడంతో నలుగురు కార్యకర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వెల్దుర్తి(మ) గోవర్ధనగిరికి చెందిన హనుమన్న, గోవిందు, డోన్(మ) ధర్మవరానికి చెందిన మధుగా గుర్తించారు, మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. డ్రైవర్ మల్లికార్జునకు తీవ్రంగా గాయపడటంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌మాద ఘ‌ట‌న తెలియ‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌త చెందారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ఆరాతీశారు. బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించే అవ‌కాశం ఉంది. గ‌తంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం సంద‌ర్భంగా కాకినాడ స‌భ‌లో కూడా ఇదే రీతిలో ఓ కార్య‌క‌ర్త మృత్యువాత ప‌డ్డాడు. ఇప్పుడు ఏకంగా న‌లుగురు కార్య‌క‌ర్త‌ల ప్రాణాలు కోల్పోవ‌డం జ‌న‌సేన పార్టీలో ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.






Related News

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Latest Survey: చిత్తూరులో ఎవ‌రి సీన్ ఎలా ఉంది?

Spread the loveఅసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ఏపీ రాజకీయాల్లో హీటు రాజుకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌న్న దానిపైRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *