ఆదన్నా..ఇటు చూడ‌న్నా..!!

Adinarayana-Reddy1455803904
Spread the love

ఆదినారాయ‌ణ రెడ్డి మంత్రియ్యారు. అంత‌కుముందు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఎమ్మెల్యే అయిన‌ప్పుడు అపోజిష‌న్ అనుకుందామ‌నుకుంటే..ఇప్పుడు ఏకంగా పాల‌క‌ప‌క్ష‌మాయే. కానీ ఆయ‌న కాస్తా త‌న వ్య‌వ‌హారాల‌లో అడ్డు త‌గులుతున్న అధికారుల మీద‌, సొంత పార్టీలో విరోధుల మీద అధికారం ప్ర‌యోగిస్తున్నారే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద కాద‌న్న‌ది ఈ కింది ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయినా పాపం ఆయ‌నేం చేయ‌గ‌ల‌డులే అని కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. జ‌మ్మ‌లమ‌డుగు ఎమ్మెల్యేకి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు గానీ అది కాస్త మొద‌ట క‌డ‌ప ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల కోస‌మే అన్న‌ట్టుగా మారింది. ఆయ‌న ఏపీకి మంత్రి అనుకుంటున్నా గానీ ఆయ‌న మాత్రం నెల రోజులుగా నంద్యాల విడిచి వ‌చ్చింది లేదు. చివ‌ర‌కు క్యాబినెట్ మీటింగ్ కి కూడా పోలేదు. నంద్యాల‌లోనే ఉండి అక్క‌డ ఎన్నిక‌ల గురించే ఆలోచించ‌డానికే స‌రిపోతోంది.

దాంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు వాసులు త‌మ దిక్కెవ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తాము ఓట్లేస్తే ఎక్క‌డో నంద్యాల‌లో ఉండ‌డ‌మేంట‌ని నిల‌దీస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని గాలికొదిలేస్తారా అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ముందు మ‌డుగుల మాదిరి గోతులు క‌నిపిస్తున్నా మంత్రిగారికి కించిత్ కూడా స్పంద‌న లేక‌పోవ‌డం సిగ్గుచేటంటున్నారు. ఇక వీధుల్లో రోడ్ల‌యితే మ‌రింత విచిత్రంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు. అందుకే డీవైఎఫ్ఐ యువ‌కులు జ‌మ్మ‌ల‌మ‌డుగు అస‌లు వ్య‌వ‌హారాల‌ను అంద‌రికీ చాటాల‌ని ఇలా ఫోటోలు తీసి వైర‌ల్ చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన ఆదినారాయ‌ణ‌రెడ్డి స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చిన్న‌పాటి వ‌ర్షాల‌కే ఎంత ద‌య‌నీయంగా మారుతుందో చూపుతున్నారు. అందుకే ఆద‌న్నా..కాస్త ఇటు చూడ‌న్నా అంటూ వేడుకుంటున్నారు. మ‌రి మంత్రికి ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ నంద్యాల త‌ప్ప మ‌రో డ్యూటీ లేదాయే..!!

20621951_1564613616947441_4696474292356260809_n

20663683_1564613806947422_2727358344431851924_n


Related News

cbn-attar-chand-basha-666-11-1468234534

టీడీపీకి ముదిరిన క‌దిరి..!

Spread the loveటీడీపీలో వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు చోట్ల క‌ల‌హాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కొన్నాళ్ల క్రితంRead More

bjp

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే డిఫెన్స్ లో ఉన్న నేప‌థ్యంలో చిన్న చిన్న అవ‌కాశాల‌ను కూడాRead More

 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *