Main Menu

తార‌స్థాయికి జ‌మ్మ‌ల‌మ‌డుగు జ‌గ‌డం

Spread the love

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా జ‌మ్మ‌ల మ‌డుగు ప‌రిణామాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి చెక్ పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ పావులు క‌దుపుతోంది. అందులో భాగంగా ఆదికి అడ్డాగా భావించే గ్రామాల్లో కూడా వైసీపీ ప్ర‌వేశిస్తోంది. ప‌లువురు టీడీపీ నేత‌ల‌ను ఆహ్వానిస్తోంది. పార్టీలో చేర్చుకుని ఆదినారాయ‌ణ రెడ్డికి పొగ‌పెట్టే ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది.

చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారాలు జమ్మలమడుగు మండలం, గొరిగనూరు చేరుకున్నాయి. సుదీర్ఘ‌కాలంగా ఈ గ్రామం ఆదినారాయ‌ణ రెడ్డికి పెట్ట‌ని కోట‌లాంటిదిగా భావిస్తున్నారు. అలాంటి గ్రామంలో ఇప్పుడు వైసీపీ ప్ర‌వేశం ఆస‌క్తిగా మారింది. చాలాకాలంగా ఆదినారాయ‌ణ రెడ్డి అండ‌గా ఉన్న వ‌ర్గాల్లో కొంద‌రు వైసీపీ కండువాలు క‌ప్పుకో్వడానికి సిద్ధ‌ప‌డ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది

ఈ నేప‌థ్యంలో గ్రామంలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌యిన వైసీపీ నేతలు . వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు వైసిపీ ఇంచాట్ట‌నిర్జ్ సుధీర్‌రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులను హౌస్ అరెస్ట్ చేశారు. అదే స‌మ‌యంలో కొంద‌రు టీడీపీ నేత‌ల‌ను కూడా గృహ‌నిర్బంధం విధించారు. అయితే ముంద‌స్తు ఆరెస్టుల ప‌ట్ల వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. మంత్రి ఆది ఆదేశాల‌తో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకున్న‌ప్ప‌టికీ గొరిగినూరులో వైసీపీ హ‌వా ఖాయం అంటున్నారు.






Related News

వైసీపీ బాట‌లోనే టీడీపీ

Spread the loveవిప‌క్షం బాట‌లోనే అధికార టీడీపీ కూడా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. ప‌లువురు నేత‌ల‌కు కండువాలు క‌ప్పే కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు శ్రీకారంRead More

జ‌గ‌న్ కి ఎదురుదెబ్బ‌లు..!

Spread the loveవైసీపీ అధినేత‌కు డ‌బుల్ షాక్ త‌గిలింది. నిర్ల‌క్ష్యం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పార్టీ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకోవ‌డంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *