Main Menu

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the love

వైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటు బ్యాంకుతో ప్ర‌భావం చూపుతో వ‌స్తున్న టీడీపీ పునాదుల మీద దెబ్బ‌కొట్టే వ్యూహంతో వైసీపీ సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే బీసీల మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టేందుకు వైఎస్ జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు.

ఇప్ప‌టికే అనూహ్యంగా బీసీల‌కు పెద్ద పీట వేయ‌డం ద్వారా జ‌గ‌న్ ఆ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో ఓ అడుగు వేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో రాజ‌మహేంద్ర‌వ‌రం ఎంపీ సీటుని కూడా బీసీల‌కు కేటాయించి కొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ హ‌యంలో కూడా ఎన్న‌డూ లేని రీతిలో రాయ‌ల‌సీమ‌లోని మూడు ఎంపీ సీట్లు బీసీల‌కు క‌ట్ట‌బెట్టారు. అది కూడా కీల‌క‌మైన మూడు సామాజిక‌వ‌ర్గాల‌ను ఎంచుకోవ‌డం ద్వారా వ్యూహ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అదే స‌మ‌యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా బీసీ వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు 36 స్థానాలు మాత్ర‌మే కేటాయించ‌గా జ‌గ‌న్ మాత్రం 41 సీట్లు ఇవ్వ‌డం ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. ఎంపీ స్థానాల విష‌యంలో కూడా వైసీపీ ఏకంగా ఏడుగురికి ఛాన్స్ ఇచ్చి రికార్డ్ సృష్టించింది. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ నేత‌లు ఖంగుతినాల్సి వ‌చ్చింది. తాజాగా జ‌గ‌న్ ఎత్తులు త‌మ పునాది ఓట్ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని అధికార పార్టీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం.

ఇక అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ చంద్ర‌బాబు క‌న్నా ముందున్నారు. ఏక‌కాలంలో మొత్తం అన్ని సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా సాహ‌సోపేతంగా అడుగులు వేశారు. టీడీపీ నేటికి మ‌రో 30 సీట్ల అభ్య‌ర్థుల విష‌యంలో ఊగిస‌లాట‌లో ఉంది. జ‌న‌సేన కేవ‌లం 32 మందినే ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ వారి క‌న్నా ముందుగా 175 సీట్ల‌కు క్యాండిడేట్స్ ని ఖ‌రారు చేయ‌డం విశేషం.






Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *