Main Menu

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the love

టాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గురించి సుమంత్ చెప్పిన విష‌యం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. హీరో సుమంత్ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్.. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌తో కలిసి గోడ దూకిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.

‘‘జగన్, నేను రెస్టారెంట్‌కి వెళ్లి కొంచెం లేటుగా ఇంటికి వచ్చాం. తనను మా ఇంట్లోనే పడుకోమని చెప్పాను. లేటుగా వెళితే వాళ్లింట్లో ప్రాబ్లమ్ అని మా ఇంటికి వచ్చాం. నా ఇంటి తాళాలు మరచిపోయాను. నా బెడ్‌రూమ్ తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) బెడ్‌రూమ్ పైన ఉండేది. దీంతో ఒక రెయిలింగ్ ద్వారా నా బెడ్‌రూమ్‌కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. కింద ఉన్న జగన్ నేను పైకి ఎక్కించేందుకు సాయం చేస్తున్నాడు. ఇంతలో సౌండ్ వినిపించి తాతగారు బయటకు వచ్చారు. కట్ చేస్తే.. నేను పైన.. జగన్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. అప్పటి వరకూ తాతగారు జగన్‌ను కలవలేదు. దీంతో ఆ సిట్యువేషన్‌లో తాతా.. రాజేశేఖర్ రెడ్డిగారి అబ్బాయి జగన్ అని అక్కడ పరిచయం చేశా. అదొక ఫన్నీ ఇన్సిడెంట్. ప్రస్తుతం తను రాజకీయాల్లో బిజీ అవడం కారణంగా తనను కలిశాను. ఇంటర్ వరకూ జగన్, నేను కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత యూఎస్‌కి కూడా కలిసే వెళ్లాం. కానీ తనకు అక్కడ నచ్చకపోవడంతో తిరిగి వచ్చేశాడు’’ అని సుమంత్ చెప్పుకొచ్చాడు.






Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *