Main Menu

జగన్ నోట చంద్రబాబు మాట

Spread the love

ఏపీ ప్రతిపక్ష నాయకుడు సీఎం చంద్రబాబు పాటను అందుకున్నారు. ఆయన మాటలే పలుకుతున్నారు. పాదయాత్ర కూడా చేపట్టి బాబు బాటలోనే నడుస్తున్న వైఎస్ జగన్ మాటలు కూడా అదే రీతిలో ఉండడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఉద్యోగాల విషయంలో ఇంటికో ఉద్యోగం అంటూ జగన్ కూడా ప్రకటించారు. గతంలో చంద్రబాబు కూడా అదే రీతిలో బాబు వస్తే జాబొస్తుందంటూ చెప్పిన సంగతి తెలిసిందే. జాబు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భ్రుతి ఇస్తామంటూ కూడా హామీ గుప్పించారు. దాంతో ఇది పక్కాగా చంద్రబాబు తరహాలోనే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. చంద్రబాబు అమలు చేయలేకపోయిన నేపథ్యంలో జగన్ ఏం చేస్తారో చూడాలి.

అనంతపురం జిల్లా పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాక అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే మన ప్రభుత్వం రావాల్సిందేనన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం.. లేదంటే భృతి కల్పిస్తామని వైసీపీ అధినేత హామీలిచ్చారు. దాంతో జగన్ ప్రకటన చర్చనీయాంశంగా మారుతోంది.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *