Main Menu

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the love

వైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతో మాజీ పోలీస్ అధికారి క‌ల నెర‌వేర‌డానికి మార్గం సుగ‌మం అయ్యింది. ఏపీ పోలీస్ శాఖ చేసిన విన్న‌పాన్ని హైకోర్ట్ తిర‌స్క‌రించ‌డంతో హిందూపురం పార్ల‌మెంట్ సీటు విష‌యంలో వైసీపీకి అభ్య‌ర్థి విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరటదక్కింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చిన హైకోర్టు తీర్పు వెలువరించింది. మాధవ్ వ్యవహారంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే పిటిషన్‌కు హైకోర్టు నిరాకరించింది. అయితే, ఇప్పటికే హిందూపురం నుంచి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు… హైకోర్టు తీర్పుతో ఆయన ఎన్నికల బరిలో దిగడం ఖాయమైపోయింది. దాంతో ఒక సంద‌ర్భంలో మాధ‌వ్ భార్య స‌వ‌తిను రంగంలో దింపాల‌ని భావించిన వైసీపీకి ఇప్పుడు అలాంటి అవ‌స‌రం లేద‌ని తేలిపోయింది.

దాంతో కురుబ సామాజిక వ‌ర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారం ఇప్పుడు నామినేష‌న్ల ప‌ర్వంలోనే పెద్ద చ‌ర్చ‌కు తీర‌దీయ‌డంతో ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.






Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *