మళ్లీ చేతికి పనిచెప్పిన బాలయ్య

nbk
Spread the love

నట సింహం మరోసారి గర్జించింది. అది కూడా అభిమాని మీద కావడంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు చేయికి పనిచెప్పి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మళ్లీ అదే పనిచేసి అభాసుపాలవుతున్నారు. సొంతనియోజకవర్గంలోనే మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మళ్లీ చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు.అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తనను దాటుకుని ముందుకెళ్తున్న ఓ అభిమానిపై ఆగ్రహంతో ఊగిపోయి అతని చెంప చెళ్లుమనిపించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్స్ నందమూరి బాలయ్య తీరుపై మండిపడుతున్నారు. గతంలో కూడా పలుమార్లు బాలకృష్ఱ అభిమానులపై చేయిచేసుకున్న విషయం విదితమే.


Related News

chandrabau kurnool

కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో టిక్కెట్ల తగాదా అప్పుడే మొదలయ్యింది.Read More

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the loveకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

 • రోడ్డెక్కిన అనంత టీడీపీ
 • చంద్రబాబు సభలో రౌడీషీటర్
 • అఖిలప్రియ ఏం మంత్రి?
 • టీడీపీకి కొత్త కష్టాలు
 • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
 • కర్నూలు కోసం బాబు కుస్తీ
 • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
 • కర్నూలు అభ్యర్థులెవరు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *