Main Menu

క‌ర్నూలు టీడీపీలో కొత్త వివాదం

kurnool
Spread the love

క‌ర్నూలు టీడీపీ లో కొత్త వివాదం రాజుకుంది. కొంత‌కాలంగా స‌ర్థుమ‌ణిగిన‌ట్టు క‌నిపించిన వ్య‌వ‌హారం ఒక్క ప్ర‌క‌ట‌న‌తో మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతోంద‌న‌నే అంశం రాజ‌కీయంగా వేడి పుట్టించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డికి చెక్ పెట్టే వ్యూహాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. భూమా బావ‌మ‌రిదికి పెద్ద త‌ల‌నొప్పిగా మార‌బోతోంది. ఈ ప‌రిణామం క‌ర్నూలు రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారుతుంది.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంద‌న్న ఆశ‌తో నిన్న‌టి వ‌ర‌కూ గ‌మ్మునున్న వారంతా గొంతు విప్పుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ భ‌విష్య‌త్తును నిర్థారించుకోవ‌డానికి నడుం క‌డుతున్నారు. అందులో భాగంగానే క‌ర్నూలు అసెంబ్లీ సీటు మీద టీజీ వెంక‌టేష్ వార‌సుడు క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా టీజీ త‌న‌యుడు భ‌ర‌త్ చేసిన ప్ర‌క‌ట‌న దానికి అద్దంప‌డుతోంది. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు టీడీపీ ఎంపీ భరత్ ప్ర‌క‌టించారు. దాంతో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారుతోంది. వాస్త‌వానికి గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీజీ వెంక‌టేష్ ను ఓడించి వైసీపీ త‌రుపున ఎస్వీ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. కానీ గ‌త ఏడాదిని పార్టీ ఫిరాయించి సైకిలెక్కేశారు. దాంతో ఈ సీటులో చిక్కు రాకూడ‌ద‌న్న అభిప్రాయంతో టీజీ వెంక‌టేష్ కి రాజ్య‌స‌భ టికెట్ ఇచ్చి పెద్ద‌ల స‌భ‌కు పంపించారు. కానీ ఇప్పుడు పెద్దాయ‌న పెద్ద‌ల స‌భ‌కు వెళ్ళినా త‌న‌కు అసెంబ్లీ టికెట్ కావాల్సిందేన‌ని భ‌ర‌త్ తెర‌మీద‌కు రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.
tg venkatesh bharath

నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీజీ, ఎస్వీ మోహన్ రెడ్డి మ‌ధ్య విబేధాలు రావ‌డం కూడా టీడీపీకి క‌ల‌వ‌రం క‌లిగించే అంశం. నంద్యాల‌లో వైశ్యుల ఓట్లు కీల‌కం. అదే స‌మ‌యంలో అక్క‌డ పోటీలో ఉన్నది ఎస్వీ స‌మీప బంధువు. అలాంటి స‌మ‌యంలో టీజీ భ‌ర‌త్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌తో కూడి ఉన్న‌వి. దానికి వెంట‌నే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా స్పందించ‌డం విశేషం. వచ్చే ఎన్నికల్లో తాను ఇదే స్థానం నుంచి పోటీ చేస్తానని, మరి, టీజీ భరత్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో తెలియదని ఆయన చెప్పడం గమనార్హం. దాంతో ఇరువురి మ‌ధ్య వ్య‌వ‌హారం ముద‌ర‌డం ఖాయంగా ఉంది. అదే జ‌రిగితే టీడీపీలో ప‌రిణామాలు ఎటు దారితీస్తాయ‌న్న‌ది ఊహించ‌డం క‌ష్ట‌మే.


Related News

Adinarayana-Reddy1455803904

అవినీతిలో మునిగిన‌ మంత్రి ఆది బంధువుకి అంద‌లం

Spread the loveఏపీలో అవినీతివ్య‌వ‌హారాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. పైగా అవినీతిప‌రుల‌కు పెద్ద పీట వేస్తున్న వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.Read More

9026_6298_TTD

తిరుమ‌ల‌లో కొత్త వివాదం

Spread the loveతిరుమల గుళ్ళో ఏమవుతున్నది ? పుట్టా వారు పగ్గాలు చేపట్టాక ఆగమ శాస్త్రాలు , వాటి నియమాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *