Main Menu

టీడీపీకి మరో షాక్, మాజీ ఎమ్మెల్యే రిజైన్

Spread the love

తెలుగుదేశం పార్టీకి ఒక్కో నాయకుడు దూరం అవుతుండడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్ర కాశ్ రెడ్డి చేరిక సంతోషం మరచిపోక ముందే మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చల్లా రామక్రుష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకి పంపించారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది వ్యక్తిగత కారణాల వల్ల టీడీపీకి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

రామకృష్ణారెడ్డి ఈ వారంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు చెబుతున్నారు. విపక్షానికి ప్రజాదరణ పెరుగుతున్న తరుణంలో తాను టీడీపీలో కొనసాగడం శ్రేయస్కరం కాదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారంటూ అనుచరుల వద్ద చల్లా వాపోతున్న తీరు దానికి తగ్గట్టుగా ఉంది. ఈనెల 8వతేదీన వైసీపీ అధినేత జగన్‌ ని కలిసి వైసీపీలో చేరబోతున్నారని సమాచారం.






Related News

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the loveవైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతోRead More

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *