మర్డర్ కేసు: మంత్రికి షాక్

murder-the-exhibition
Spread the love

వైసీపీ నాయకుడి హత్య కేసులో మంత్రికి షాక్ తగిలింది. మంత్రి కొడుకుని నిందితుడిగా తేలుస్తూ విచారణ జరపాలని కోర్ట్ ఆదేశించడంతో కేఈ క్రుష్ణముర్తి కుటుంబం ఉలిక్కిపడింది. తాజాగా డోన్ కోర్ట్ ఇచ్చిన తీర్పు కలకలం రేపింది. వైసీపీ ప్రత్తికొండ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా పనిచేసిన చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో కేఈ తనయుడిని నిందితుడిగా కోర్ట్ తేల్చింది.

డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్‌ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్‌ చేయాలని డోన్‌ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల కోసం సన్నాహాలు చేసుకుంటున్న శ్రీదేవి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆమె వేసిన పిటీషన్ తో కోర్ట్ ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్‌లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ… నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్‌ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్‌ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్‌ఐ నాగప్రసాద్‌లను నిందితులుగా చేర్చాలని సూచించింది.

దాంతో ఇప్పుడు శ్యామ్ భవిష్యత్తు ఢోలాయమానంలో పడుతున్నట్టవుతోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి స్థానంలో బరిలో దిగాలని శ్యామ్ ఆశిస్తున్నారు. కానీ తాజాగా కోర్ట్ కి లభించిన ఆధారాలు పరిశీలించిన తర్వాత హత్య కేసు కీలకంగా మారే అవకాశం కనిపిసత్ోంది.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *