Main Menu

క‌డ‌ప‌లో ఉక్కు: టీడీపీలో చిక్కు!

Spread the love

క‌డ‌ప జిల్లాలో కొత్త తగాదా తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య త‌క‌రారు పెడుతోంది. ఇప్ప‌టికే ఇన్ఛార్జ్ మంత్రి ముందు పెద్ద పంచాయితీ జ‌రిగింది. దాంతో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గానికే అన్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు తీసుకెళుతున్నారంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిని నిలదీశారు. ఉక్కు ప‌రిశ్ర‌మ శంకుస్థాప‌న కోసం స‌న్నాహాలు చేస్తున్న వేళ ఆ ప‌రిశ్ర‌మ నిర్మాణ స్థ‌లంపై ఇప్పుడు త‌గాదా మొద‌లు కావడం విశేషం

మైల‌వ‌రం మండ‌లం కంబాల‌దిన్నె వ‌ద్ద క‌డ‌ప ఉక్కు కోసం చంద్ర‌బాబు శంకుస్థాపన చేయ‌బోతున్నారు. ప‌రిశ్ర‌మ వ‌స్తుందా , రాదా, కేంద్రం స‌హ‌కారం లేకుండా రాష్ట్ర‌మే నిర్మిస్తుందా లేదా అన్న సందేహాలు ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేయ‌డం విశేషంగా మారింది. అయితే ఈ నేప‌థ్యంలోనే కంబాల‌దిన్నె వ‌ద్ద కాకుండా క‌డ‌ప న‌గ‌రానికి చేరువ‌లో గ‌తంలో వైఎస్ హ‌యంలో సేక‌రించిన 8వేల ఎక‌రాల భూముల్లో ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని ప‌లువురు టీడీపీ నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు.

కంబాల‌దిన్నెకు మైల‌వ‌రం డ్యామ్ నీళ్ళు అందుబాటులో ఉంటాయి కాబ‌ట్టి, కంబాల దిన్నె స‌రైన స్థ‌లం అవుతుంద‌ని మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. సీఎం ర‌మేష్ వంటి వారు వాదిస్తున్నారు. అయితే ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్ అన్నీ అందుబాటులో ఉన్న కొప్ప‌ర్తి పారిశ్రామిక వాడ‌లోనే స్టీల్ ప‌రిశ్ర‌మ క‌ట్టాల‌న్న‌ది మిగిలిన నేత‌ల వాద‌న‌గా ఉంది. నీటి స‌దుపాయం కోసం అస‌ర‌మైతే సోమ‌శిల బ్యాక్ వాట‌ర్ ని పైప్ లైన్ ద్వారా త‌ర‌లించే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకు భిన్నంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు త‌ర‌లించ‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని వాదిస్తున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం టీడీపీలో కొత్త స‌మ‌స్య‌కు దారితీసేలా క‌నిపిస్తోంది.

వైఎస్ హ‌యంలో సేక‌రించిన భూములు కావ‌డంతో క‌డ‌ప స్టీల్ నిర్మాణం కొప్ప‌ర్తిలో శంకుస్థాప‌న చేస్తే క్రెడిట్ వైసీపీకి పోతుంద‌న్న‌ది కొంద‌రు నేత‌ల అభిప్రాయంగా వినిపిస్తోంది. దాంతో వ‌చ్చే ఎన్నిక‌లే ల‌క్ష్యంగా సాగుతున్న క‌డ‌ప స్టీల్ శంకుస్థాప‌న కంబాల‌దిన్నెలోనే జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో క‌డ‌ప ఉక్కు టీడీపీలో కొత్త చిక్కు తెచ్చిపెట్టేలా మారుతుంద‌న్న‌ది ప‌లువురి అభిప్రాయం.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *