శిల్పా సోదరుల మధ్య సఖ్యత చెడిందా

shilpa brothers
Spread the love

నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందులోనూ ఎంతో ఆశలు పెట్టుకున్న వైసీపీ శ్రేణులు ఖంగుతున్నాయి. చివరకు బరిలో దిగిన శిల్పా బ్రదర్స్ తీవ్రంగా వర్రీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అనుకున్నదానికి భిన్నంగా ఫలితం రావడంతో తీవ్రంగా హతాశయులయ్యారని సమాచారం. ఎత్తులకు పై ఎత్తులు వేసి గట్టెక్కట్టడంలో దిట్టలుగా భావించే శిల్పా సోదరుల లక్ష్యం నెరవేరకపోవడంతో మనోవేధనకు గురయ్యారనే వాదన వినిపిస్తోంది.

చివరకు ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరు బ్రదర్స్ మధ్య తగువు కూడా జరిగిందని కథనాలు వస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో శిల్పా బ్రదర్స్ మీద నైతికంగా దెబ్బతీసే రీతిలో ప్రచారం ఊపందుకుంది. వైసీపీ ఓటమితో శిల్పా సోదరులు చింతాకాంత్రులయ్యారు. ఇదే సమయంలో శిల్పా మోహన్‌రెడ్డిపై తమ్ముడు చక్రపాణిరెడ్డి రుసరుసలాడారని రాతలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘‘అంతా నువ్వే చేశావంటూ అన్నను నిలదీశారట. టీడీపీలో హాయిగా ప్రశాంతంగా ఉన్న నన్ను వైసీపీలో బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి లాకొచ్చావు. ఇప్పుడు పదవి పోయింది నా రాజకీయ జీవితం తారుమారైంది’’ అంటూ చక్రపాణిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారంటూ వార్తలు వండి వారుస్తున్నారు.

వాస్తవానికి శిల్పా బ్రదర్స్ మధ్య గతంలో కొంత సఖ్యత చెదిరినప్పటికీ ఇటీవలే ఇద్దరూ ఏకమయ్యారు. సఖ్యత కుదరడంతో అనుచరులంతా ఆనందంగా ఉన్నారు. అయితే నంద్యాల ఫలితాల తర్వాత మరోసారి బంధం చెడిందనే వాదన చేయడం ద్వారా శిల్పా బ్రదర్స్ మధ్య చిచ్చు రాజేసే యత్నం కొందరు కావాలనే చేస్తున్నారని వారి అనుచరులు చెబుతున్నారు. అయితే నిప్పు లేకుండా పొగ రాదన్న సామెత ప్రకారం చూస్తే వారి మధ్య పొరపొచ్ఛాలు మొదలయినట్టేనని కొందరు భావిస్తున్నారు.


Related News

former-cm-kirankumar-reddy-brother-kishore-kumar-reddy-to-join-in-tdp-id3_1510832759

నారా వారి గూటిలో నల్లారి

Spread the love1Shareచిత్తూరు జిల్లా రాజకీయాల్లో కొత్తమార్పులకు తెరలేసింది. మూడున్నర దశాబ్దాల వైరంగా ఉన్న నల్లారి, నారా కుటుంబాలు ఒక్కటయ్యాయి.Read More

shilpa brothers

శిల్పా బ్రదర్ప్ పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Spread the love12Sharesఏపీ ప్రభుత్వ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అవుతోంది. అదికార పార్టీలో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వంRead More

 • తెలుగు మహిళా తలవంచుకో…!
 • టీడీపీ నేతను కాల్చేసిన వైసీపీ నాయకుడు
 • ఫోర్జరీ లో పట్టుబడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే
 • రెండు పోస్టులు అనంతపురానికే..
 • తన టికెట్ ఖాయం అంటున్న ఫిరాయింపు ఎంపీ
 • పల్లెకి బాబు న్యాయం చేస్తారా?
 • పవన్ కల్యాణ్ సీటు అదే…కన్ఫర్మ్
 • జగన్ యాత్రలో జాప్యం..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *