Main Menu

టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!

Spread the love

క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం త‌ల్ల‌డిల్లిపోతోంది. ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఏకంగా పార్టీ మూడుముక్క‌లుగా మారడంతో త‌ల‌నొప్పిగా త‌యార‌య్యింద‌ని వాపోతున్నారు. చివ‌ర‌కు నాయ‌కులు కూడా పెద్ద‌గా స్పందించ‌క‌పోవ‌డంతో నిరుడు విజ‌యం సాధించిన నంద్యాల ఆనందం అప్పుడే ఆవిరి అయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర్గ‌పోరు క‌ల‌క‌లం రేపుతోంది.

ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా వ‌ర్గం టీడీపీలో చేరిన నాటి నుంచి ఇరిగెల వ‌ర్గం వ్య‌తిరేకిస్తోంది. దాంతో రెండు శిబిరాలు కొన‌సాగుతున్నాయి. ఇక నంద్యాల ఎన్నిక‌ల త‌ర్వాత ఏవీ సుబ్బారెడ్డి కూడా తెర‌మీద‌కు రావ‌డంతో పార్టీ మూడు ముక్క‌ల‌యిన‌ట్టుగా క‌నిపిస్తోంది. శోభ‌, భూమా ఉన్నంత కాలం ప్రతి ఎన్నికలోను భూమానాగిరెడ్డికి కుడి భుజంగా వ్య‌వ‌హ‌రించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు భూమా ఫ్యామిలీకి పూర్తిగా దూర‌మ‌య్యారు. కార్యకర్తలను కూడగట్టడంలో, ఎన్నికల వ్యూహం రచించడంలో చురుకుగా పాల్గొన్న సుబ్బారెడ్డి దూరం కావ‌డంతో భూమా వ‌ర్గానికి పెద్ద దెబ్బ‌గానే భావించ‌వ‌చ్చు. నంద్యాల ఎన్నిక‌ల్లోనే సుబ్బారెడ్డి అసంతృప్తిగా ఉన్న‌ప్ప‌టికీ అనివార్యంగా టీడీపీ కోసం ప‌నిచేసిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతుంటారు. చివ‌ర‌కు సుబ్బారెడ్డికి నామినేటెడ్ ప‌ద‌వి ప్ర‌తిపాద‌న వ‌చ్చిన స‌మ‌యంలో అఖిల‌ప్రియ అడ్డుచెప్పార‌నే అభిప్రాయం సుబ్బారెడ్డి ఆగ్ర‌హాన్ని రెట్టింపు చేసింది. దాంతో ఇప్పుడు మాత్రం స‌సేమీరా రెండు శిబిరాలు క‌లిసే అవ‌కాశం లేద‌ని నిర్ధారించేస్తున్నారు.

అదే స‌మ‌యంలో సుదీర్ఘంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమాకి వ్య‌తిరేకంగా నిలిచిన ఇరిగెల వ‌ర్గం కూడా పోటీగా నిలుస్తోంది. త‌మ స‌త్తా చాటుతామ‌ని చెబ‌తోంది. దాంతో ఆళ్ల‌గ‌డ్డ‌లో ఇరిగెల వ‌ర్గీయుల‌తో కూడా విబేధాలు తీవ్రం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే భూమా అఖిలప్రియ‌కు చెక్ పెట్ట‌డానికి చివ‌రి నిమిషంలో ఇరిగెల‌, ఏవీ సుబ్బారెడ్డి ఏకం అయిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నే వారు కూడా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతానికి మాత్రం మూడు వ‌ర్గాల కుమ్ములాట‌ల‌తో తెలుగుదేశం పార్టీ ప‌రువు తీస్తున్నార‌ని శ్రేణులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నాయి. విష‌యం అధిష్టానానికి చేరిన‌ప్ప‌టికీ ఇన్ఛార్జ్ మంత్రి గానీ, పార్టీ అద్య‌క్షుడు గానీ జోక్యం చేసుకోగ‌ల స్థితి క‌నిపించ‌డం లేదంటున్నారు. అధినేత ఇటు క‌న్నేస్తే త‌ప్ప అప్ప‌టి వ‌ర‌కూ క‌థ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.


Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *