డిప్యూటీ సీఎం కేఈకి మ‌ళ్లీ కుద‌ర‌ద‌న్నారు..!

ke krishna murthy
Spread the love

ఆయ‌న ఏపీలో కీల‌క‌మంత్రి. పైగా డిప్యూటీ సీఎం. రెవెన్యూ శాఖ నిర్వ‌హిస్తున్నారు. కానీ ఆయ‌న శాఖ నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో ఆయన‌కు అవ‌కాశం లేదు. మ‌రోసారి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి మొండిచేయి త‌ప్ప‌లేదు. దాంతో త‌న స‌హ‌చ‌రుడు కేఈ ప‌ట్ల చంద్ర‌బాబు చిన్న‌చూపు చూస్తున్నార‌నే అభిప్రాయం కేఈ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జెండా వందనం చేసే మంత్రుల వివ‌రాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ అందులో కేఈ కృష్ణమూర్తికి జెండా వందనం చేసే అవకాశం ద‌క్క‌లేదు. అన్ని జిల్లాల్లోనూ ఇన్‌ఛార్జ్‌ మంత్రులే జెండా ఎగురవేస్తారంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కేఈ సొంత జిల్లా కర్నూలులో కాల్వ శ్రీనివాసులు జెండా వందనం చేస్తారు. కేఈ మాత్రం కి మాత్రం అవ‌కాశం ద‌క్క‌లేదు.

ఇప్పటికే కేఈకి అన్ని అధికారాల్లోనూ చంద్రబాబు కోత పెట్టిన విషయం తెలిసిందే. రాజ‌ధాని వ్య‌వ‌హారాల నుంచి ఇత‌ర అనేక కీల‌కాంశాల‌లో కేఈకి చోటు ద‌క్క‌లేదు. ఇప్పుడు చివ‌ర‌కు జెండావంద‌నం చేసే భాగ్యం కూడా లేకుండా పోవ‌డం విశేషం. క్యాబినెట్ లో అంద‌రిక‌న్నా సీనియ‌ర్ మంత్రికి ఛాన్స్ లేక‌పోవ‌డం విశేష‌మే.






Related News

kodumuru manigandhi

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేని…

Spread the loveక‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనంటూ వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు.Read More

ys jagan pawan cbn

బాబుని కాద‌ని జ‌గ‌న్ పై ప‌వ‌నాస్త్రం!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి మీడియా ముందుకొచ్చారు. ఈసారి గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా త‌నుRead More

  • మర్డర్ కేసు: మంత్రికి షాక్
  • కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు
  • బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు
  • టీడీపీకి 10మంది రాజీనామా
  • చంద్రబాబుకి గుడి..
  • కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
  • కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ
  • రోడ్డెక్కిన అనంత టీడీపీ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *