Main Menu

జ‌గ‌న్ కోట‌లో టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

Spread the love

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన అభ్య‌ర్థుల విష‌యంలో అన్ని పార్టీలు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయి. అవ‌స‌రం అనుకున్న చోట ఇత‌ర పార్టీల నేత‌ల‌కు వ‌ల వేస్తున్నారు. మ‌రో ప్ర‌త్యామ్నాయం లేని నాయ‌కులు కూడా వెంట‌నే జంపింగ్ కి సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి అహ్మ‌దుల్లా చేరారు. వైఎస్, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి మంత్రి వ‌ర్గాల్లో ప‌నిచేసిన ఆయ‌న రెండు సార్లు క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

వైఎస్ స‌న్నిహితుడ‌యిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ కి మాత్రం దూరంగా ఉన్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైసీపీ త‌రుపున అంజాద్ బాషా విజ‌యం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మరోసారి ఆయ‌న వైసీపీ నుంచి బ‌రిలో దిగ‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో టీడీపీ కూడా మైనార్టీ నేత‌ను రంగంలో దింపేందుకు పావులు క‌దిపింది. అహ్మదుల్లాని పార్టీలో కి ఆహ్వానించింది. కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా అహ్మ‌దుల్లా కాంగ్రెస్ లో ఉండి పోటీ చేస్తార‌ని భావించిన‌ప్ప‌టికీ తాజాగా ఆయ‌న నేరుగా చంద్ర‌బాబుని క‌లిసి త్వ‌ర‌లో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌ప‌డిన త‌రుణంలో టీడీపీ అభ్య‌ర్థిత్వం ఆయ‌న‌కు ఖరార‌యిన‌ట్టుగా చెబుతున్నారు.

వైసీపీకి గ‌ట్టి ప‌ట్టున్న క‌డ‌ప జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కేవ‌లం ఒకే ఒక్క సీటు ద‌క్కింది. ఈసారి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని టీడీపీ భావిస్తోంది. గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాలు ద‌క్కించుకోవాల‌ని ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అహ్మ‌దుల్లా చేరిక టీడీపీకి కొంత మేలు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *