Main Menu

టీడీపీకి ముదిరిన క‌దిరి..!

Spread the love

టీడీపీలో వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు చోట్ల క‌ల‌హాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుద‌ల మీద ఆశ‌తో కొంత స‌ర్థుమ‌ణిగిన వ్య‌వ‌హారం ఇప్పుడు క‌ట్ట‌లు తెంచుకుంటోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే అనంత‌పురం జిల్లా క‌దిరిలో కాక రాజుకుంటోంది. కదిరి నియోజకవర్గం టీడీపీలో విభేదాలపర్వం ముదురుతోంది. కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషాకు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. వారిద్దరిని సమన్వయ పరచడానికి జిల్లా టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆ ఇద్దరూ టీడీపీలోనే ఉంటూ వేర్వేరు కుంపట్లుగా మారారు. పార్టీ కార్య‌క్ర‌మాలు, కార్యాల‌యాలు, క్యాంపులు అన్నీ ఇద్ద‌రూ విడివిడిగా నిర్వ‌హించుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

తాజాగా దళితతేజం కార్యక్రమం సాక్షిగా ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఏపీ ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ దేవానంద్‌ ఆధ్వర్యంలో దళితతేజం-తెలుగుదేశం కార్యక్రమం జరుగుతున్నట్టు కదిరి పట్టణంలో పోస్టర్లు వెలిశాయి. దేవానంద్‌ కదిరి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే చాంద్‌బాషాను, నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట ప్రసాద్‌ను కలుపుకుని కార్యక్రమం నిర్వహించాలి. కానీ ఈ విషయంలో కందికుంటకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే వ‌ర్గం ర‌గులుతోంది. ఫ్లెక్సీల‌లో ఎక్క‌డా త‌మ‌కు త‌గిన గుర్తింపు లేద‌ని వాదిస్తోంది. గ‌తంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి హోదాలో కందికుంట కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చాంద్‌బాషా ఫొటోలు కనిపించకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు గొడవ చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తనకు నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కలేదని చాంద్‌బాషా టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో చివరి నిమిషంలో మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఆ సంఘటన వారిద్దరి మధ్య మరిన్ని విభేదాలకు దారితీసింది.

సరిగ్గా ఇప్పుడు కదిరిలో అలాంటి వాతావరణమే చోటుచేసుకుంది. దళితతేజం కార్యక్రమానికి ఏర్పాటు విష‌యంలో కందికుంట‌కు గుర్తింపు లేక‌పోవ‌డంపై క‌స్సుమంటున్నారు. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి నేత‌ల విబేధాల‌తో ద‌ళిత తేజం కార్య‌క్ర‌మం ఓమారు వాయిదా కూడా ప‌డింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 కి వాయిదా వేశారు. అయినా కందికుంట వ‌ర్గం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు., ముఖ్యంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్ల ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత దేవానంద్ అదే హోదాలో ఫ్లెక్సీల ఏర్పాటుని వివాదంగా మారుస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకుని చాంద్ బాషాని కట్ట‌డి చేయ‌క‌పోతే క‌దిరిలో ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దాంతో క‌దిరిలో ముదురుతున్న త‌గాదాల‌తో టీడీపీ శ్రేణులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ద‌క్కినా రెండో వ‌ర్గం స‌హించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంతా భావిస్తున్నారు.


Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *