Main Menu

చిత్తూరులో కొత్త మలుపు, వైసీపీలోకి సీనియర్ నేత

Spread the love

సీఎం సొంత జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశాలు కావాలంటూ పలువురు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఐదు ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు సార్లు విజయం సాధించిన సీకే బాబు కూడా తనకు ఛాన్స్ కావాలంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.

వైసీపీలో అవకాశం దక్కితే జగన్ పార్టీ కండువా కప్పుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. బలిజ సామాజికవర్గం కీలకంగా ఉండే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు జయచంద్రారెడ్డి(సీకే బాబు) విజయం సాధించడం ఆయన స్టామినాను తెలుపుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

2014లో డీకే సత్యప్రభ టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఆమెకు పోటీగా వైసీపీ కూడా బలిజ సామాజికవర్గానికే చెందిన జంగాలపల్లి శ్రీనివాసులకు ఛాన్సిచ్చింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకే సీటు దక్కుతుందని శ్రీనివాసులు ఆశిస్తున్నారు. సత్యప్రభ స్థానంలో ఆమె తనయుడు రంగంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పోటీ చేస్తే కష్టాలు తప్పవని నిర్థారణకు వచ్చిన సీకే బాబు అవకాశం ఇస్తే వైసీపీ లో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు.

సీకే బాబు లాంటి నాయకుడు పార్టీలో చేరితో జిల్లా కేంద్రం చిత్తూరులో వైసీపీ బలం పుంజుకుంటుందని వైసీపీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. బలిజ ఓట్లు ఈసారి జనసేన వైపు మళ్లితే అది టీడీపీ ఆశలకు గండి కొడుతుందని, తద్వారా సీకే బాబు లాంటి నేత విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగవుతాయని అంచనాలు వేస్తున్నారు. దాంతో సీకే బాబు చేరిక ఇప్పుడు చిత్తూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ కాబోతోంది.






Related News

వైసీపీ బాట‌లోనే టీడీపీ

Spread the loveవిప‌క్షం బాట‌లోనే అధికార టీడీపీ కూడా వ్య‌వ‌హ‌రించ‌బోతోంది. ప‌లువురు నేత‌ల‌కు కండువాలు క‌ప్పే కార్య‌క్ర‌మాల‌కు చంద్ర‌బాబు శ్రీకారంRead More

జ‌గ‌న్ కి ఎదురుదెబ్బ‌లు..!

Spread the loveవైసీపీ అధినేత‌కు డ‌బుల్ షాక్ త‌గిలింది. నిర్ల‌క్ష్యం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పార్టీ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకోవ‌డంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *