Main Menu

చెవిరెడ్డి ఎందుకు ట్రాన్స‌ఫ‌ర్ చేశారు…?

Spread the love

చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. పెద్ద స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వివాదానికి ఇప్పుడు చెవిరెడ్డి కేంద్ర బిందువు అయ్యారు. దాంతో సంఘ‌మిత్ర‌లకు డ‌బ్బులు ట్రాన్స‌ఫ‌ర్ చేసిన చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారుతోంది. ఆయ‌న భార్య ల‌క్ష్మి అకౌంట్ నుంచి సంఘ‌మిత్రల‌కు డ‌బ్బులు ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డంపై టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. వాస్త‌వానికి ఈనెల మొద‌టి వారంలో డ‌బ్బులు ట్రాన్స‌ఫ‌ర్ చేసిన‌ప్ప‌టికీ సంఘ‌మిత్ర‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు. అయితే ఈ విష‌యం టీడీపీ నేత‌ల‌కు చేర‌డం, అధికారుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డంతో క‌థ మారింది. త‌మ‌కు తెలియ‌కుండా, త‌మ అంగీకారం లేకుండా డ‌బ్బులు ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డాన్ని సంఘ‌మిత్ర‌లంతా ఖండించాల్సి వ‌చ్చింది. టీడీపీ నేత‌ల ఒత్తిడితోనే వ్య‌వ‌హారం వివాదంగా మారింద‌ని వైసీపీ ఆరోపిస్తోంది.

అయితే సంఘ‌మిత్ర‌ల‌కు చ‌ట్ట‌విరుద్ధంగా నిధులు బ‌దిలీ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు సంఘ‌మిత్రల ప‌ట్ల ప్రేమ ఒల‌క‌పోస్తున్నార‌ని మండిప‌డుఓతంది. అయితే చెవిరెడ్డి మాత్రం వేత‌నాలు లేని సంఘ‌మిత్ర‌ల‌ను ఆదుకోవ‌డం కోస‌మే తాను ఇలాంటి ప్ర‌య‌త్నం చేశాన‌ని, వారికి అభ్యంత‌రం అయితే రెండు వారాలు గ‌డిచిన త‌ర్వాత ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ నేత‌లు, సంఘ‌మిత్ర‌ల‌కు స‌హాయం అందించ‌డాన్ని వ‌క్రీక‌రిస్తున్న తీరు స‌రికాదంటున్నారు.

మొత్తంగా చంద్ర‌గిరి రాజ‌కీయాల్లో ఇప్పుడు చెవిరెడ్డి , సంఘ‌మిత్ర‌ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతుండ‌డంతో టీడీపీ నేత‌లు ఎదురుదాడికి దిగుతున్నారు. సంఘ‌మిత్ర‌ల ప‌ట్ల తీసుకొచ్చిన ఒత్తిడితో నే క‌థ మ‌లుపులు తిరుగుతోంద‌ని వైసీపీ ఆరోపిస్తోంది.






Related News

జ‌గ‌న్ తో చేతులు క‌లిపిన మ‌రో సీనియ‌ర్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో జంపింగ్ లో ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి సీRead More

గుడ్ బై చెప్పిన ప‌రిటాల ర‌వి అనుచ‌రుడు

Spread the loveప‌చ్చ పార్టీలో మ‌రో వికెట్ ప‌డింది. అధికార ప‌క్షానికి హ‌స్తం పార్టీ జ‌త‌గ‌ట్ట‌డం ప‌ట్ల ప‌లువురు నిర‌స‌న‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *