Main Menu

కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..

Spread the love

కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో టిక్కెట్ల తగాదా అప్పుడే మొదలయ్యింది. పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో పాలకపక్షంలో కలకలం రేగుతోంది. ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పదే పదే చర్చకు రావడంతో పలువురికి తీవ్ర అసహనం కలిగిస్తోందని చెబుతున్నారు.

ముఖ్యంగా రెండు ఎంపీ స్థానాల విషయంలోనూ టీడీపీలో కొంత సందిగ్ధం ఏర్పడింది. సిట్టింగ్ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మరోసారి ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ఆమెకు వైసీపీలో అలాంటి అవకాశం లేకపోవడం వల్లే టీడీపీలో చేరారనే ప్రచారం ఉంది. ఇక టీడీపీలో కూడా ఆమెను ఎమ్మగనూరు పంపించాలనే ప్రయత్నంలో ఓ వర్గం ఉన్నట్టు సమాచారం. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా సీటు మారే యోచనలో ఉన్నారనే ప్రచారం చేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం టీడీపీలో పెద్ద పితలాటకానికి దారితీస్తోంది.

అదే సమయంలో నంద్యాల ఎంపీ సీటు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కర్నూలు ఎమ్మెల్యే స్థానాన్ని టీజీ వెంకటేష్ తనయుడు పట్టుపడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ఆళ్లగడ్డ పంపించే ప్రయత్నం సాగుతోందనే ప్రచారం భూమా వర్గీయుల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాల ఎంపీ సీటు నుంచి పోటీకి సిద్ధం కావాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించినట్టు కొందరు చెబుతున్నారు. దాంతో ఆళ్లగడ్డ సీటు కోసం ఎస్వీ సుబ్బారెడ్డి గానీ ఎవీ సుబ్బారెడ్డి ని గానీ పరిశీలించవచ్చనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎటు మళ్లుతాయోననే చర్చ సాగుతోంది. ఏమయినా ఈ తంతు మాత్రం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారడం ఖాయంగా ఉంది.






Related News

చెవిరెడ్డి ఎందుకు ట్రాన్స‌ఫ‌ర్ చేశారు…?

Spread the loveచిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. పెద్ద స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయ్యారు.Read More

రేణుక ‘బుట్టా’ దాఖలు…!

Spread the loveకర్నూలు ఎంపీ బుట్టా రేణుక కలలు పండేలా లేదు. ఆమె ఆశలన్నీ అడియాశలయ్యేలా మారుతోంది. పార్టీ ఫిరాయించినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *