కర్నూలు రాజకీయాల్లో కొత్త మలుపులు

kurnool
Spread the love

కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్త మలుపులు తప్పేలా లేవు. ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా నేతల్లో ఆందోళనకు దారితీస్తోంది. రెండు ప్రధాన పార్టీల్లోనూ గుబులు రేకెత్తుతోంది. నంద్యాల శాసన సభ ఎన్నికలో ఫలితాల అనంతరం భారీ ఎత్తున పార్టీ మా ర్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటికిపుడు ఉండకపోవచ్చని కొందరు, ఇదే వేడిలో పార్టీ మారుతారని మరి కొందరు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప ఎన్నికల ఫలితాల్లో అతి తక్కువ ఓట్లు రావడంపై రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. తన మాటలను అందరూ నమ్మి రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్తారే కాని తనను ప్రోత్సహించలేదని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పార్టీ నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయంపై దృష్టి పెట్టాలని ఉన్నా తన మద్దతుదారుల నుంచి ఒత్తిడి కారణంగా రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అత్యధికులు అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన తుది నిర్ణయాన్ని మరో రెండు, మూడు రోజుల తరువాతే ప్రకటించనున్నారు. దీంతో ఆయన టిడిపిలో చేరితే ఇటు నందికొట్కూరు, అటు పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులను ఆలోచనలో పడేసింది. ఆయన పార్టీలో చేరితే పాణ్యం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తారని భావిస్తుండగా నందికొట్కూరు పార్టీలో సైతం ఆయన కీలక భూమిక పోషించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని టిడిపి నేతలు ఆయన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

బైరెడ్డితో పాటు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం త్వరలో టిడిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తుండగా ఆయా నియోజకవర్గంలోని పార్టీ నేతలు గుబులు చెందుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్యేలు చేరితే వారికి పార్టీ అధినేత ఏ మేరకు ప్రాధాన్యతనిస్తారు, తమ భవిష్యత్తు ఏంటన్న అంశంపై వారు తమ శ్రేయోభిలాషులతో చర్చిస్తున్నట్లు వెల్లడవుతోంది. కాగా పార్టీలో మార్పులు చేర్పులపై వైకాపా నేతల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోయే నేతల కారణంగా కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తింటుందని, దీని వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వారంటున్నారు. నాయకులు పార్టీని వీడినా ఓటర్లు మాత్రం తమ వెంటే ఉంటారన్న విశ్వాసం ఉన్నా కార్యకర్తల్లో ఏర్పడే నిస్పృహను తొలగించడానికి సమయం పడుతుందని వారంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్తే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం పార్టీపై ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని మానసికంగా దెబ్బ తీయడానికి టిడిపి అధినేత చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారని వారు అంగీకరిస్తున్నారు. అధికారంలో ఉన్నందున ఆ పార్టీకి సహకరించడానికి భారీ పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉంటారని, దాని వల్ల ఆర్థిక సమస్య ఉండదని వెల్లడిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న మార్పులు, చేర్పుల చర్చ వాస్తవరూపం దాలుస్తుందో లేదో కాని ఇరు పార్టీల నాయకులను కలవరపెడుతోందని విశే్లషకులు సైతం భావిస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపించేంత వరకు ఒకరిద్దరు మినహా భారీ సంఖ్యలో పార్టీ ఫిరాయింపులు ఉండబోవని వారంటున్నారు.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *