కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు

kurnool
Spread the love

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా రాజకీయాల్లో వేడి చల్లార్చేయత్నం మొదలయ్యింది. కాక కుదుట పరిచే యత్నంలో పార్టీ అధినేత ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. జిల్లాలో పార్టీలో ఏర్పడిన విబేధాలు చల్లార్చడానికి అధినేత కుస్తీ ప్రారంభించినట్టు సమాచారం. ప్రధానంగతా కర్నూలు, నంద్యాల, కోడుమూరు నియోజకవర్గాల పరిణామాలు పాలకపక్షానికి తలనొప్పిగా మారాయి. గతంలో పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేదని అర్థమవుతోంది. దాంతో చివరి మార్గంగా విభేదాలు పరిష్కరించిందేకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

నేతలంతా సమస్యలపై ఒకరినొకరు చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటే సమస్య ఉండదని ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే కమిటీ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. ఎవరికి వారు భీష్మించుకు కూర్చుంటే పార్టీకి నష్టం జరుగుతుంది, ఇంత కాలం అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకోలేదని చివరి అవకాశమిస్తున్నానని ఇకనైనా కలిసి పని చేయకపోతే చర్యలు తప్పవని కఠువుగానే హెచ్చరించినట్టు చెబుతున్నారు.

గుండ్రేవుల జలాశయ నిర్మాణం, వేదావతి ఎత్తిపోతల, పత్తికొండ, ఆలూరు, డోన్ నియోజకవర్గాల్లోని చెరువులకు కృష్ణా జలాలను తరలింపు అంశంలో అధికారిక ప్రకటన కావాలని జిల్లా నేతలు కోరడంతో చంద్రబాబు స్పందించారు. అదే సమయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేరిక మీద ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, జిల్లా నేతలు అనవసరంగా వివాదాలు రాజేయవద్దని సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి టీజీ వెంకటేష్ హాజరుకాలేదు. ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ఉండడంతో రాలేదని పార్టీ నేతలు తెలిపారు.


Related News

Adinarayana-Reddy1455803904

టీడీపీ తలనొప్పిగా మారిన సీఎం

Spread the loveతెలుగుదేశం పార్టీ అసలే సమస్యల్లో ఉంది. తాజాగా వాటికి తోడుగా సీఎం రమేష్ వ్యవహారం పెద్ద తలనొప్పిగాRead More

HY05RAMESH

టీడీపీకి ఒక్కసీటు కూడా రాకూడదని సీఎం రమేష్ ప్రయత్నం

Spread the loveఅసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలో తగాదాలు మరో పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. కడప జిల్లాలో పట్టు సాధించగలమాRead More

 • కర్ణాటకలో చెరోవైపు సాగుతున్న టీడీపీ, వైసీపీ
 • టీడీపీలో గల్లా కలకలం
 • టీడీపీకి ఊరట…
 • ఎమ్మెల్సీ టికెట్ ఆమెకే ఖాయం
 • ఆళ్లగడ్డ టీడీపీకి అసలు సమస్య మొదలు..
 • చంద్రబాబు చేయి దాటిపోయిందా..?
 • టీడీపీ నేత సుబ్బారెడ్డిపై మంత్రి అనుచ‌రుల దాడి
 • రాజీనామాకి సిద్ధ‌మ‌వుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *