టీడీపీలో మరో తగాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?

తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఓ అడుగు వేసింది. కీలక పదవులను కేటాయింపులు చేసింది. అయితే అందులో ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి వ్యవహారం పెద్ద తగాదాగా మారింది. మతం కోణంలో పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం వివాదాస్పదం చేశారు. అయితే దాని వెనుక టీడీపీలో వర్గపోరు కారణమని పలువురు భావిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గిరీ ఆశించిన అనేకమంది ఆ పదవి దక్కకపోవడంతో పుట్టా సుదాకర్ యాదవ్ కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలకు ఇదో తార్కాణంగా భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ వేడి ఆర్టీసీ చైర్మన్ గిరీని తాకింది. తనకు ఇస్తానని చెప్పిన పదవి ఇవ్వకపోవడమే కాకుండా, గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలయిన వర్ల రామయ్యకు చైర్మన్ పదవి ఇచ్చి, తనకు రీజనల్ పదవి ఇవ్వడంపై చల్లా రామకృష్ణారెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రీజినల్ చైర్మన్ పదవి ఇచ్చి అవమానించారంటూ వాపోయారు. తనకు పదవి ఇవ్వకపోయినా బాధపడేవాడిని కాదని, తన స్థాయి తగ్గించి అవమానించడమేమిటని నిలదీశారు.
గడిచిన ఎన్నికలకు ముందు పార్టీలోకి ఆహ్వానించి తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆచరణరూపం దాల్చలేదన్నారు. అలాంటిది తనకు నాలుగేళ్ల తర్వాత రీజనల్ పదవి ఇచ్చి చంద్రబాబు ఘోరంగా మోసం చేసినట్టుగా ఉందని చెబుతున్నారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. పార్టీ మారే విషయం కూడా ఆలోచిస్తున్నట్టు, త్వరలోనే సమాధానం చెబుతానంటూ స్పష్టం చేసేశారు. దాంతో ఈ వ్యవహారం టీడీపీకి మరో పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. తగాదాలతో పార్టీ పుట్టి మునగడం ఖాయమని కర్నూలు నేతలు వాపోవాల్సి వస్తోంది.
Related News

టీడీపీ నేత సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరుల దాడి
Spread the loveటీడీపీ వ్యవహారాలు వీధికెక్కుతున్నాయి. వివాదాస్పదంగా మారుతున్నాయి. ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నాయి. ఏకంగా దాడులు చేసుకునే వరకూ వచ్చేశాయి.Read More

రాజీనామాకి సిద్ధమవుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యే
Spread the loveఏపీ రాజకీయాల్లో ఓవైపు బీజేపీ. మరోవైపు వైసీపీ, అన్నింటికీ మించి పవన్ పార్టీ నుంచి వస్తున్న ఎదురుదాడితోRead More