Main Menu

బాబు, బీజేపీ రాజీ..!

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపులు ఖాయ‌మ‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. తాడోపేడో తేల్చుకుంటామ‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు రాజీ కి సిద్ధ‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే హోదా మీద అనేక ర‌కాలుగా వ్యాఖ్య‌లు చేసి చంద్ర‌బాబు కొంత ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయ్యారు. తాజాగా హోదా నినాదం మారుమోగుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం మ‌ళ్లీ రాజీప‌డ్డార‌నే ప్ర‌చారం విశేషంగా మారింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో అమిత్ షాతో టీడీపీ నేత‌లు చ‌ర్చ‌లు సాగించారు. ఫ‌లితాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఉభ‌య పార్టీలు ఉమ్మ‌డి అవ‌గాహ‌న‌తో సాగాల‌ని మాత్రం నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజా స‌మాచారం. దాంతో మార్చి 5 నుంచి ప్రారంభంకాబోతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు అంటూ చేసిన స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు అన్నీ వెన‌క్కిపోయిన‌ట్టేనా అని భావిస్తున్నారు.

వాస్త‌వానికి వెంక‌య్య నాయుడు రాజ‌కీయాల నుంచి ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాజ్యాంగ‌ప‌ర‌మైన ప‌ద‌విలో ఉన్నందును బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. కానీ బీజేపీ, టీడీపీ బంధం తెగిపోతే ఏపీలో ఇరువురు న‌ష్ట‌పోతార‌ని, అందులో చంద్ర‌బాబు ఎక్కువ న‌ష్ట‌పోతార‌ని అత్య‌ధికులు భావిస్తున్న స‌మ‌యంలో న‌ష్ట‌నివార‌ణ కోసం వెంక‌య్య రంగంలో దిగ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అమిత్ షా, టీడీపీ నేత‌ల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆయ‌న నైతిక‌త‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. పైగా ఆయ‌న స‌మ‌క్షంలోనే, వెంక‌య్య నివాసంలోనే చ‌ర్చ‌లు సాగించిన తీరు మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రంగా చెప్ప‌వ‌చ్చు.

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా బీజేపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌ల పేరిట‌, పార్లమెంట్ లో నిర‌స‌న‌ల‌కు దాదాపు దూరం అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ నామ‌మాత్ర‌పు నిర‌స‌న‌ల‌కు దిగినా, ఏపీ ప్ర‌జ‌లు ఆశించిన స్థాయిలో టీడీపీ త‌గాదాకు సిద్ధ‌మ‌య్యేలా లేద‌ని తెలుస్తోంది. మ‌రికొన్ని హామీలు, ఇత‌ర కాల‌యాప‌న కార్య‌క్ర‌మాల‌తో తామేదో సాధించ‌మ‌ని చెప్పుకోవ‌డంతో స‌రిపెట్టుకునే అవ‌కాశాలున్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏమైనా ఇప్ప‌టికే రాజీనామాలు ప్ర‌స‌క్తే లేద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేదే లేద‌ని తేల్చేసిన టీడీపీ, ఇక ఉద్య‌మాల‌త ద్వారా ప్ర‌జాకాంక్ష‌ను ప్ర‌స్ఫుటించే విష‌యంలో కూడా మీన‌మేషాలు లెక్కించ‌డం ఖాయం అని చెప్ప‌వ‌చ్చు.


Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *