Main Menu

జ‌గ‌న్ తో చేతులు క‌లిపిన మ‌రో సీనియ‌ర్

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో జంపింగ్ లో ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి సీ రామ‌చంద్ర‌య్య వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో క‌డ‌ప జిల్లాలో వైసీపీకి అద‌న‌పు ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గం కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే వైసీపీలో బ‌లిజ సామాజిక‌వ‌ర్గ నేత సీ రామ‌చంద్ర‌య్య‌కు ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం క‌నిపిస్తోంది. రాయ‌ల‌సీమ‌లో ప్ర‌భావితం చేయ‌గ‌ల బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన సీఆర్ రాక‌తో వైసీపీకి మేలు జ‌రుగుతుంద‌నే అభిప్రాయం జ‌గ‌న్ శిబిరంలో వినిపిస్తోంది.

స్వ‌త‌హాగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన రామ‌చంద్ర‌య్య ఎన్టీఆర్ స్పూర్తితో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆత‌ర్వాత ప్ర‌జారాజ్యం రాక‌తో టీడీపీని వీడి చిరంజీవి వెంట న‌డిచారు. ఆ త‌ర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం చేయ‌డంతో కిర‌ణ్ మంత్రివ‌ర్గంలో ఎమ్మెల్సీ కోటాలో అమాత్య హోదా ద‌క్కించుకున్నారు. ఇక ప్ర‌స్తుతం కాంగ్రెస్, టీడీపీ పొత్తు కుద‌ర‌డంతో ఆయ‌న కాంగ్రెస్ ని వీడారు. సొంత సామాజిక‌వ‌ర్గంలో ప‌ట్టున్న నేత త‌మ పార్టీలో చేర‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ చేతుల మీదుగా కండువా క‌ప్పుకుని పార్టీలో చేరిన త‌ర్వాత సీ రామ‌చంద్ర‌య్య మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు పై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిప‌డ్డారు. గవర్నర్ వ్యవస్ధను కూడా చంద్రబాబు నాశనం చేశారని విమ‌ర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యంను కాపాడాలంటే చంద్రబాబు లాంటి వ్యక్తులను దూరం పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదని, ఇప్పుడు తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారంటూ వ్యాఖ్యానించారు. త‌న‌తో పాటుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు వస్తారని ఆయ‌న చెప్ప‌డం విశేషం.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *