అయ్యో..బైరెడ్డి

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692
Spread the love

బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం. మంచి వాగ్దాటి గ‌ల మాజీ మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంద‌రికీ తెలిసిన నాయ‌కుడు. కానీ ఆయ‌న‌కు కాలం క‌లిసి వ‌స్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా అవ‌కాశం లేకుండా పోయిన ఆయ‌న‌కు ఈసారి కూడా అలాంటి ప‌రిస్థితి త‌ప్ప‌దా అనే సందేహం వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న కెరీర్ కు సంబంధించిన స్ప‌ష్ట‌త లోపించ‌డంతో ఈ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి..

2009 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న రాయ‌ల‌సీమ నినాదంతో టీడీపీకి దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించినా చంద్ర‌బాబు అనుమ‌తించ‌లేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న అనుచ‌రుడిని ఇండిపెండెంట్ గా బ‌రిలో దింప‌డంతో టీడీపీ అధిష్టానం కూడా బైరెడ్డిని ఆహ్వానించింది. చంద్ర‌బాబుతో చ‌ర్చ‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకుని ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రించిన బైరెడ్డిని మ‌ళ్లీ టీడీపీలో చేర్చుకోవ‌డానికి అంగీక‌రించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆ విష‌యాన్ని బైరెడ్డి కూడా అనుచ‌రుల వ‌ద్ద ప్ర‌స్తావించారు. తాను వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత మ‌ళ్లీసైకిలెక్కుతున్న‌ట్టు సంకేతాలిచ్చేశారు. కానీ అది ఆచ‌ర‌ణ‌కు నోచు కోవ‌డం లేదు. టీడీపీ అధిష్టానం ఆహ్వానించ‌డం లేదు. సంక్రాంతి, శివ‌రాత్రి, ఉగాది, శ్రీరామ‌న‌వ‌మి ఇలా పండుగ‌ల‌న్నీ దాటిపోతున్నా పిలుపులేక‌పోవ‌డంతో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉసూరుమంటున్నారు.

ముఖ్యంగా జిల్లాలోని టీడీపీ కీల‌క నాయ‌క‌త్వం అంతా ఆయ‌న రాకును వ్య‌తిరేకిస్తోంది. దాంతో చంద్ర‌బాబు కూడా చివ‌ర‌కు ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీలో చేరాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించే అవ‌కాశం లేద‌ని ఇప్పుడు ఆయ‌న భావిస్తున్నారు. దాంతో త‌న భ‌విష్య‌త్తు ఏమిట‌న్న‌ది అగ‌మ్య‌గోచ‌రంగా మారుతుండ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వీల‌యినంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకునే యోచ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా నందికొట్కూరు సీటు ఎస్సీ రిజ‌ర్వుడు అయిన త‌ర్వాత ఆయ‌న‌కు మ‌రో సీటు కూడా క‌ష్టంగా మారుతోంది. దాంతో ఆయ‌న ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిని రేపుతోంది. ఒక‌ప్పుడు ఒంటిచేత్తో జిల్లా రాజ‌కీయాల‌ను శాసించ‌గ‌ల స్థాయికి ఎదిగిన బైరెడ్డి ఇప్పుడు ఇలా సందిగ్ధ స్థితిలో మిగిలిపోవ‌డం గ‌మ‌నిస్తే బ‌ళ్లు ఓడ‌లు..ఓడ‌లు బ‌ళ్లు కావ‌డం అంటే ఇదేనేమో అనిపిస్తోంది.


Related News

katasa

కాటసానికి లైన్ క్లియ‌ర్ చేసిన వైసీపీ

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలో మ‌రో సీనియ‌ర్ కి లైన్ క్లియ‌ర్ అయ్యింది. కాట‌సాని రాంభూపాల్ రెడ్డి రంగRead More

challa ramakrishna reddy

టీడీపీలో మ‌రో త‌గాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?

Spread the loveతెలుగుదేశం ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఓ అడుగు వేసింది. కీల‌క ప‌ద‌వులను కేటాయింపులు చేసింది.Read More

 • వైసీపీలోకి మ‌రో వార‌సుడు
 • వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే
 • జ‌న‌సేన‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
 • చంద్ర‌బాబుపై తిర‌గ‌బ‌డండి..
 • టీడీపీకి ముదిరిన క‌దిరి..!
 • ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ
 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *