అటూ ఇటూ రాజీనామాలే..!

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766
Spread the love

బీజేపీ, టీడీపీ బ్రేక‌ప్ జ‌రిగిపోయింది. చాలాకాలంగా ఊహాగానాలు చెల‌రేగిన నేప‌థ్యంలో తాజాగా ఇరు పార్టీలు త‌లాక్ చెప్పేశాయి. తెలుగుదేశం పార్టీ తాజా నిర్ణ‌యంతో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆపార్టీ బ‌య‌ట‌కు రాబోతోంది. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డంలో భాగంగా ఇద్ద‌రు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. పౌర విమాన‌యాన మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, సాంకేతిక మంత్రి సుజ‌నా చౌద‌రి రాజీనామాలు చేయ‌డం ఖాయంగా మారింది. దాంతో వారు రాజీనామాలు చేయ‌గానే ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్ట‌వుతుంది. త‌ద్వారా ఏపీలో బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేసే అవ‌కాశం ఉంది. దేవాదాయ మంత్రి మాణిక్యాల‌రావు, వైద్యారోగ్య‌మంత్రి కామినేని కూడా రాజీనామాలు చేసే అవ‌కాశం ఉంది. ఇరువైపులా రాజీనామాల వ్య‌వ‌హారానికి రేపే ముహూర్తంగా నిర్ణ‌యించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌య్యింది.

దాంతో ఇరు పార్టీలు దూరం అయిన నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయా ప‌రిణామాలు వేగంగా మారుతాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌ధాన‌మంత్రి మోడీతో మాట్లాడిన త‌ర్వాత నిర్ణ‌యం అనే పేరుతో చంద్ర‌బాబు కొంత కాల‌యాప‌న చేసిన‌ప్ప‌టికీ పార్టీలో తీవ్ర ఒత్తిడి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో బీజేపీ కూట‌మి నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌స్తే పార్ల‌మెంట్ లో ప‌రిణామాలు మారుతాయ‌నే అభిప్రాయం ఉంది. అదే స‌మ‌యంలో రాజీనామాల విష‌యంలో ఎంపీ టీజీ వెంక‌టేష్ కొంత అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్రచారం సాగుతోంది. రాజీనామాల క‌న్నా కేంద్రంలో ఉండి పోరాడాల‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా సుజ‌నా చౌద‌రి కూడా రాజీనామా స‌రికాద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.

మొత్తంగా విడాకులు ఖాయం అయిన త‌ర్వాత విడిపోయిన పార్టీలు ఎటు మ‌ళ్లుతాయోన‌నే చ‌ర్చ సాగుతోంది. బీజేపీ ఇప్ప‌టికే అనేక మంది నేత‌ల‌ను త‌న దారికి తెచ్చుకున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అదే స‌మ‌యంలో ఓటుకు నోటు, ఏపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో అవినీతి వంటి అంశాల‌ను ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు ప్ర‌స్తావించిన నేప‌థ్యంలో కేంద్రంలో పెద్ద‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *