అఖిలప్రియ ఏం మంత్రి?

bhuma cbn
Spread the love

ఆశ్చర్యంగా ఉన్నా అనేకమందిలో అనుమానం కలుగుతోంది. ఆమె తీరు అలా ఉంది. పర్యాటక శాఖా మంత్రిగా ఉన్నప్పటికీ ఆ శాఖ కార్యక్రమాలను ఆమె పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దాంతో అఖిలప్రియ వ్యవహారం ఆసక్తిగా కనిపిస్తోంది.

రాజకీయాలలో యువనాయకురాలిగా అఖిలప్రియకు మంచి భవిష్యత్తు ఉంది. అయితే దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఆమె విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. శాఖా వ్యవహారాలలో క్రియాశీలంగా లేకపోవడంతో ఆమెకు పట్టు దొరకడం లేదు. చివరకు పర్యాటక శాఖ వ్యవహారాలను మరో మంత్రి కనుసన్నల్లో నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇటీవల కాకినాడ, విశాఖ లో బీచ్ ఫెస్టులు నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీగా నిధులు కేటాయించారు. కాకినాడలో అయితే ఏఆర్ రెహ్మాన్ లైవ్ కన్సెర్ట్ కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంత్రులు యనమల, చినరాజప్ప మూడు రోజులు అక్కడే ఉన్నారు. కానీ సంబంధిత శాఖా మంత్రి మాత్రం ఢుమ్మా కొట్టారు. విశాఖ ఉత్సవ్ కూడా అంతా తానై గంటా శ్రీనివాసరావు నడిపిస్తే అఖిల ప్రియ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. మంత్రి వస్తారని చెప్పినప్పటికీ ఆమె గైర్హాజరు కావడడం విశేషంగా మారింది.

దాంతో అఖిలప్రియా మంత్రిగా తన వ్యవహారాల మీద ద్రుష్టిపెట్టడం లేదనే వాదన వినిపిస్తోంది. అసలు అఖిలప్రియ తనను తాను మంత్రి అనే విషయం మరచిపోతుననట్టుందని టూరిజం అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ ఘటన తర్వాత ఆమె రాజీనామా చేయాలని సూచించి చంద్రబాబు కలకలం రేపారు. అంతేగాకుండా నంద్యాలలో భూమా కుటుంబానికి చెక్ పెట్టడానికి ఏవీ సుబ్బారెడ్డిని ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో ఈ పరిణామం అఖిలప్రియ భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *