టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బెల్ట్ షాప్

jc prabhakara reddy
Spread the love

ఆశ్చర్యమే అనిపించినా..ఎక్సైజ్ అధికారుల దాడుల్లో నిర్థారణ జరిగింది కాబట్టి నమ్మాల్సిందే. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత ఇంట్లో నడుస్తున్న బెల్ట్ షాపు విస్మయానికి గురిచేస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈ వ్యవహారం బయటపడింది. యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లిలో ఎమ్మెల్యే జేసీకి సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే బెల్ట్ షాప్ నిర్వహిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే తాజాగా ఎక్సైజ్ అధికారులు చేసిన దాడుల్లో నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ రాజకీయ ఒత్తిడితో కేసు ఏమేరకు ముందుకు సాగుతుందన్నది చర్చనీయాంశం అయ్యింది. అదే సమయంలో మరోవైపు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటికీ అదే ఇంట్లో వెంటనే బెల్ట్ షాప్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాంతో అబ్కారీ శాఖాధికారులు కూడా ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారని తెలుస్తోంది.


Related News

murder-the-exhibition

మర్డర్ కేసు: మంత్రికి షాక్

Spread the loveవైసీపీ నాయకుడి హత్య కేసులో మంత్రికి షాక్ తగిలింది. మంత్రి కొడుకుని నిందితుడిగా తేలుస్తూ విచారణ జరపాలనిRead More

kurnool

కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు

Spread the loveతెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా రాజకీయాల్లో వేడి చల్లార్చేయత్నం మొదలయ్యింది. కాక కుదుట పరిచే యత్నంలో పార్టీRead More

 • బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు
 • టీడీపీకి 10మంది రాజీనామా
 • చంద్రబాబుకి గుడి..
 • కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
 • కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ
 • రోడ్డెక్కిన అనంత టీడీపీ
 • చంద్రబాబు సభలో రౌడీషీటర్
 • అఖిలప్రియ ఏం మంత్రి?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *