పాపం..క‌మ‌ల నాధులు..!

bjp-tdp
Spread the love

కూర‌లో క‌రివేపాకు గురించి తెలుసు క‌దా. దానికున్న ప్రాధాన్య‌త త‌క్కువేం కాదు. కానీ తీరా కూర తింటున్న‌ప్పుడు క‌రివేపాకు ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌స్తుతం ఏపీలో క‌మ‌ల‌నాధుల ప‌రిస్థితి అలా తయార‌య్యింది. వాస్త‌వానికి కేంద్రంలో అధికార పార్టీ అయినా ఏపీలో ఆపార్టీ ప‌రిస్థితి అంతంత‌మాత్ర‌మే. అందుకే ఇప్పుడు నంద్యాల వంటి ప‌రిస్థితుల్లో దాదాపు అంట‌రాని పార్టీగానే మారిపోయింది. అయినా రాజ‌కీయంగా టీడీపీకే త‌మ మ‌ద్ద‌తు అని ఆపార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.

వాస్త‌వానికి మిత్ర‌పక్షాలు అన్న‌ప్పుడు క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇరుపార్టీలు ఉమ్మ‌డిగా ప్ర‌చార బాధ్య‌త‌లు స‌హా అన్నీ చూడాల్సి ఉంటుంది. కానీ నంద్యాల సీన్ రివ‌ర్స్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. నంద్యాల‌లో మైనార్టీల ప్ర‌భావం చాలా ఎక్కువ‌. అందులోనూ మైనార్టీల‌కు క్యాబినెట్ లో చోటు క‌ల్పించ‌లేద‌న్న కార‌ణంతో టీడీపీ మీద ఆ వ‌ర్గంలో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో మోడీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశానికి ఆ సెగ ఖాయం అన్న‌ట్టుగా ఉంది. అలాంటి ప‌రిస్థితుల్లో క‌మ‌ల‌నాధుల‌తో క‌లిసి సాగ‌డం ఇష్టం లేని టీడీపీ ఒంట‌రిగానే బ‌రిలో దిగింది.

క‌నీసం ఒక్క జెండా కూడా కాషాయం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల భాగ‌స్వామే అయిన‌ప్ప‌టికీ నంద్యాల‌లో మాత్రం పొత్తు లేద‌న్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. అయినా బీజేపీ నేత‌లు ఏమీ అన‌లేని స్థితి. చివ‌ర‌కు జెండా లేకుండా ప్ర‌చారానికి రావాలంటూ పరిమితులు పెట్టినా క‌మ‌ల‌ద‌ళం క‌నీసం నోరెత్తలేని ప‌రిస్థితి ఉంది. కేంద్రం పెద్ద‌లు స్పందించ‌కుండా తాము టీడీపీతో వ్య‌వ‌హారం మీద విమ‌ర్శ‌లు చేయ‌డం ఇబ్బందిక‌రమ‌ని భావిస్తున్న నేత‌లంతా దాదాపుగా సైలెంట్ అయిపోయారు. అయినా చివ‌ర‌కు త‌మ‌ను దూరంగా పెడుతున్న టీడీపీకే మ‌ద్ధ‌తు అంటూ బీజేపీ ఏపీ క‌మిటీ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఇక ఇప్పుడైనా బీజేపీ జెండా నంద్యాల‌లో క‌నిపిస్తుందా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే.


Related News

murder-the-exhibition

మర్డర్ కేసు: మంత్రికి షాక్

Spread the loveవైసీపీ నాయకుడి హత్య కేసులో మంత్రికి షాక్ తగిలింది. మంత్రి కొడుకుని నిందితుడిగా తేలుస్తూ విచారణ జరపాలనిRead More

kurnool

కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు

Spread the loveతెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా రాజకీయాల్లో వేడి చల్లార్చేయత్నం మొదలయ్యింది. కాక కుదుట పరిచే యత్నంలో పార్టీRead More

 • బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు
 • టీడీపీకి 10మంది రాజీనామా
 • చంద్రబాబుకి గుడి..
 • కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
 • కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ
 • రోడ్డెక్కిన అనంత టీడీపీ
 • చంద్రబాబు సభలో రౌడీషీటర్
 • అఖిలప్రియ ఏం మంత్రి?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *