సీఎంకే రాజీనామా సమర్పించిన చైర్మన్

chaman
Spread the love

తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాకి చెందిన పరిణామాలు ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ పదవీ మార్పిడి వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి పరిటాల సునీత తన అనుచరుడు చమన్ ని కొనసాగించాలని చివరి వరకూ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు అనుచరుడు పూల నాగరాజుకి జెడ్పీ గిరీ దక్కబోతోంది. అయితే చమన్ రాజీనామా గడిచిన నెలలో చేయాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో నంద్యాల ఎన్నికల నేపథ్యంలో మైనార్టీ నేతను పదవి నుంచి తప్పిస్తే ముప్పు వస్తుందని ఆశించి అది వాయిదా వేశారు. చమన్ కూడా గోస్పాడు మండలంలో బాధ్యతలు తీసుకుని ఎన్నికల విధులు నిర్వహించారు.

అయితే ఇప్పుడు చమన్ వ్యతిరేకవర్గం గట్టిగా పట్టుపట్టడంతో చివరకు రాజీనామా చేసి పదవి నుంచి దిగపోక తప్పలేదు. అయితే తనకు ప్రత్యామ్నాయంగా మరో అవకాశం ఇస్తేనే పదవి నుంచి వైదొలుగుతానని షరతు పెట్టడంతో చివరకు చమన్ కి అర్బన్ అథారిటీ పదవి గానీ, మరో అవకాశం గానీ ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్టు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన నేరుగా తన రాజీనామాను జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు చేతిలో పెట్టినట్టు చెబుతున్నారు. దాంతో అనంతపురం కొత్త జెడ్పీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తెరమీదకు వచ్చినట్టయ్యింది. మొత్తంగా గడిచిన కొన్ని నెలలుగా నానుతున్న జెడ్పీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో టీడీపీ పెద్దలు ఊపిరిపీల్చుకుంటున్నారు.






Related News

chandrabau kurnool

కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో టిక్కెట్ల తగాదా అప్పుడే మొదలయ్యింది.Read More

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the loveకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

  • రోడ్డెక్కిన అనంత టీడీపీ
  • చంద్రబాబు సభలో రౌడీషీటర్
  • అఖిలప్రియ ఏం మంత్రి?
  • టీడీపీకి కొత్త కష్టాలు
  • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
  • కర్నూలు కోసం బాబు కుస్తీ
  • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
  • కర్నూలు అభ్యర్థులెవరు?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *