Main Menu

ఫ‌స్ట్ లిస్ట్ లో పేరు కోసం ప్ర‌య‌త్నాలు

Spread the love

అనంత‌పురం జిల్లాలో ఈసారి అన్ని పార్టీలు బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఏక‌ప‌క్ష విజ‌యం సాధించ‌డంతో వైసీపీ ఓట‌మి పాల‌య్యింది రెండు సీట్లు గెలుచుకుని, ఒక‌రు ఫిరాయించ‌డంతో ఒంట‌రిగా మిగ‌లాల్సి వ‌చ్చింది. దాంతో ఈసారి దాదాపు అన్ని నియోజవర్గాల్లో అన్ని పార్టీల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అసెంబ్లీకి పోటీచేసేందుకు టికెట్ తమకు దక్కతుందా లేదా అన్న ఉత్కంఠ అటు సిట్టింగ్‌లు, ఇటు కొత్తవారిలో నెలకొంది.

టీడీపీలో అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యం. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటికే అధినేత కసరత్తు చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి వారుసుల పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హిందూపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకే మళ్లీ సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ బాలయ్య కోస్తాలో పోటీకి సిద్దపడితే సీఎం కుమారుడు లోకేష్‌ను పురం బరిలో దింపుతారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మిగిలిన అనంతపురం, కదిరి, శింగనమల, మడకశిర, గుంతకల్లు, పుట్టపర్తి అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలను బేరీజువేసుకుని ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు.

వైసీపీ విషయానికి వస్తే టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉండ‌డంతో తొలి జాబితాపై అయోమయం నెలకొంది. ప్రస్తుత సమన్వయకర్తలకే టికెట్ దక్కుతుందన్న నమ్మకం లేదన్న ప్రచారం సాగుతోంది. ఈనెల 9న ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎన్నికల్లో పోటీచేసే కొందరి పేర్లను జగన్ ప్రకటించవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఈ జాబితాలో జిల్లాకు చెందిన ఎంతమంది పేర్లు ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కమ్యూనిస్టులతో పొత్తు నేపధ్యంలో జిల్లాలో సీట్ల పంపిణీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టులు కోరుకునే అసెంబ్లీ సెగ్మెంట్‌ను మినహాయించి మిగతా చోట్ల బలమైన నాయకులను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. పార్టీ టికెట్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోవడంతో అన్ని స్థానాలకు అభ్యర్థులు ఉంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థులు, మేధావి వర్గానికి చెందిన వారిని పోటీకి నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటివారి పేర్లను కొంత ఆలస్యంగా జనసేన చీఫ్ ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తు టికెట్ల లొల్లి ఇలా ఉండగా, పార్టీ ఫిరాయింపులు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పార్టీలో టికెట్ రాకుంటే మరో పార్టీలోకి జంప్ చేసి టికెట్ కైవసం చేసుకునేందుకు కొంతమంది ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించే వారి సంఖ్య ఫిబ్రవరి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.






Related News

ప్ర‌త్య‌ర్థి సిద్ధం, మంత్రి అయోమ‌యం

Spread the loveఏపీ క్యాబినెట్ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని చిక్కులు వీడ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి క్లారిటీRead More

కోడికత్తి కేసులో టీడీపీ నేతలకు జైలు

Spread the loveకోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకెళ్లాల్సి వస్తుందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *