Main Menu

ఎస్సీల‌పై మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

Spread the love

ఎవ‌రైనా ఎస్సీలుగా పుట్టాల‌ని కోరుకుంటారా అంటూ సీఎం చేసిన కామెంట్స్ జ‌నం ఇంకా మ‌ర‌చిపోలేదు. వాటికి కొన‌సాగింపుగా మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి మ‌రోమారు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీల‌ను కించ‌ప‌రిచేలా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగులో జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించే సంద‌ర్భంగా ఆదినారాయ‌ణ రెడ్డి వ్యాఖ్య‌ల ప‌ట్ల ప‌లువురు మండిప‌డుతున్నారు.

ఎస్సీలు శుభ్రంగా ఉండ‌రంటూ మంత్రి నోరుపారేసుకున్నారు. అంతేగాకుండా తాగి, ప‌నులకు పోకుండా ఉంటున్నార‌ని వ్యాఖ్యానించారు. డ‌బ్బును తాగుడికి త‌గ‌లేయ‌కుండా, శుభ్రంగా ఉంటే బాగుంటుందంటూ సూచించారు. అంతేగాకుండా ఎస్సీ ఎస్టీ చ‌ట్టాన్ని వ్యాపార‌ల‌బ్ది కోసం వాడొద్దంటూ సూచించండం సంచ‌ల‌నంగా మారుతోంది.

దాంతో మంత్రి కామెంట్స్ ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేపడం ఖాయంగా ఉంది. ఎస్సీల ప‌ట్ల గ‌తంలో సీఎం, ఇప్పుడు మంత్రి చేసిన కామెంట్స్ వివాదాస్పంగా మారుతున్నాయి.






Related News

ప్ర‌త్య‌ర్థి సిద్ధం, మంత్రి అయోమ‌యం

Spread the loveఏపీ క్యాబినెట్ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డిని చిక్కులు వీడ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి క్లారిటీRead More

కోడికత్తి కేసులో టీడీపీ నేతలకు జైలు

Spread the loveకోడికత్తి కేసులో టీడీపీ నేతలు జైలుకెళ్లాల్సి వస్తుందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *