Main Menu

నోరుపారేసుకున్న మంత్రి ఆది..

Spread the love

ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. రెండు రోజుల క్రిత‌మే అర్థ‌రూపాయి వాటా గురించి ప్ర‌స్తావించి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచ‌ని విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఏకంగా సీఎం చంద్రబాబు త‌న‌ను అవినీతి చేసి సంపాదించుకోమ‌ని చెప్పారంటూ బ‌హిరంగంగా వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఆదినారాయ‌ణ రెడ్డి తాజాగా విప‌క్ష నేత జ‌గ‌న్ మీద గురిపెట్టాడు. తీవ్ర ప‌ద‌జాలంతో అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌డం విశేషం. మంత్రి అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల ప‌ట్ల ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రతిపక్ష నేత జగన్‌పై మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి నోరు పారేసుకున్నారు. జగన్‌ను ఊరపందితో పోల్చారు. జగన్‌వి ఊర పంది ఆలోచనలన్నారు. జగన్ దగుల్బాజీ ఆలోచనల వల్ల ప్రధాని మోదీకి నోటీసులు వచ్చాయని, బీజేపీ జగన్‌ను దగ్గరకు రానివ్వదని జోస్యం చెప్పారు. ఇన్ని కేసులున్న వ్యక్తులు బయటపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. తమను విమర్శించే శక్తిని జగన్ ఎప్పుడో కోల్పోయారని, అధికారులను ప్రలోభపెట్టే జగన్ ఐఏఎస్‌ల కొంప ముంచారని దుయ్యబట్టారు. సీఎం కార్యాలయం అధికారులపై విమర్శలా అంటూ ప్రశ్నించారు.

‘‘నేను మంత్రిగా సచివాలయానికి వస్తే.. జగన్, సాయిరెడ్డి చేతులు కట్టుకుని కోర్టుకెళ్లారు. జమ్మలమడుగు అభివృద్ధికి నేను, రామసుబ్బారెడ్డి.. ఎటువంటి ప్రతిపాదనలు పెట్టినా సీఎం అంగీకరిస్తామన్నారు. నా మాటలను వక్రీకరించి విజయసాయిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేశారు. వాటాలు పంచుకునేంత నీచంగా కన్పిస్తున్నామా?. అంటూ మండిప‌డ్డారు.






Related News

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

ఎస్సీల‌పై మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

Spread the loveఎవ‌రైనా ఎస్సీలుగా పుట్టాల‌ని కోరుకుంటారా అంటూ సీఎం చేసిన కామెంట్స్ జ‌నం ఇంకా మ‌ర‌చిపోలేదు. వాటికి కొన‌సాగింపుగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *