Main Menu

తిరుప‌తి, నంద్యాల టికెట్లు ఖరారు

Spread the love

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపాల‌ని భావిస్తున్న వైఎస్ జ‌గన్ అందుకు త‌గ్గ‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా నంద్యాల‌, తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానాల‌కు ఇద్ద‌రు పారిశ్రామిక వేత్త‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన ఈ రెండు సీట్ల‌లో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించారు. తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం జ‌గ‌న్ కి తోడుగా సాగుతున్నారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాంతో ఆయ‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో కొత్త నేత‌ను కండువా క‌ప్పి ఆహ్వానించిన జ‌గ‌న్ టికెట్ ఖాయం చేసిన‌ట్టు స‌మాచారం.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇవాళో రేపో వెలువడుతుం దనుకుంటున్న తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల వెల్లువ మరింత ఊపందుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎంఆర్‌ గ్రూపు సంస్థల చైర్మన్‌ మన్నెం మధుసూదనరావు, నంద్యాలకు చెందిన పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఎంఎంఆర్ ని తిరుప‌తి ఎంపీ సీటు కోసం జ‌గ‌న్ ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.

ఇక బీజేపీ నుంచి వైసీపీలో చేరిన బ్ర‌హ్మానంద‌రెడ్డికి నంద్యాల ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. వారితో పాటుగా ప‌లువురు సీనియ‌ర్లు, మాజీ ఎమ్మెల్యేలు దాస‌రి బాల‌వ‌ర్థ‌న్ రావు, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి స‌హా అనేక మంది వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు.






Related News

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the loveవైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతోRead More

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *